సంక్రాంతి సంబరాన్ని ప్రతిఒక్కరూ ఎంతో సంతోషంగా చేసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలు అంబరాన్నంటుతాయి. సంక్రాంతి పండుగకు ఇప్పటి నుంచే హడావిడి మొదలైపోయింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లి.. పల్లెటూరి రుచులను ఆస్వాదించాలని అనుకుంటున్నారు. దీంతో.. పండుగ రాకముందే పడిగాపులు మొదలయ్యాయి. అటు రిజర్వేషన్ల వెయిటింగ్ లిస్టులు పేరుకుపోతున్నాయి. రెండు నెలల ముందే ట్రైన్లలో రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. ట్రైన్ టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకుందామన్నా... వెయిటింగ్ లిస్టే కనిపిస్తుంది. 

 

అదే సమయంలో రైల్వే శాఖ అదనపు రైళ్లు వేసినట్లు ప్రకటించినా అవి కూడా సరిపోవు. కానీ.. ఈ సంవత్సరం మాత్రం ఏకంగా 78 అదనపు రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ నుంచీ విశాఖ, తిరుపతి, భువనేశ్వర్‌కు వెళ్తాయి. ఇవి జనవరి 5 నుంచీ 30 వరకూ నడుస్తాయి. ఈ రైళ్లు ప్రయాణికుల రద్దీని కొంతవరకూ సెట్ చేస్తాయని అనుకోవచ్చు. అయితే ఈ రైళ్ల వివరాలు తెలుసుకుందాం. 08501-08502 - విశాఖ-సికింద్రాబాద్-విశాఖ, 08573-08574 - విశాఖ-తిరుపతి, 08407-08408 - భువనేశ్వర్-సికింద్రాబాద్, 82737 - సికింద్రాబాద్-భువనేశ్వర్.. డిసెంబర్ 24 నుంచీ (నేడే) ఈ రైళ్లలో రిజర్వేషన్ చేసుకోవచ్చు. 

 

హైదరాబాద్-కాజీపేట-వరంగల్-సికింద్రాబాద్ మధ్య 4 పుష్‌పుల్ రైళ్లను పర్మనెంట్‌గా నడపబోతున్నారు. ఈ రైళ్లకు 16 బోగీలు ఉంటాయి. సికింద్రాబాద్-వరంగల్ మధ్య 67264, హైదరాబాద్-కాజీపేట మధ్య 67266, వరంగల్-హైదరాబాద్ మధ్య 67264, హైదరాబాద్-వరంగల్ మధ్య 67267 రైళ్లు నడవబోతున్నాయి.ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్‌కి ఛార్జీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాచిగూడ-టాటానగర్ మధ్య 26 ప్రత్యేక రైళ్లు నడవబోతున్నాయి. ముఖ్యంగా 07438-07439 ట్రైన్ కాచిగూడ-టాటానగర్ మధ్య వెళ్తుంది. ఈ స్టేషన్ల మధ్య సువిధ ప్రత్యేక రైలును తెచ్చారు. మ‌రోవైపు  ప్రైవేట్ వాహనాల్లో దోపిడీ మామూలుగా లేదు. ఒక్కో టికెట్ ధర 2వేల పైమాటే. ఇక ఆర్టీసీ స్పెషల్ సర్వీస్‌ పేరుతో ఎక్కువ వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: