మామూలుగా అయితే వయసు 65 సంవత్సరాలు దాటి పోగానే వారికి వృద్ధాప్య పింఛన్ ఇస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. అయితే వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ  వారికి చెల్లించే విషయంలో మాత్రం చాలా అవకతవకలు జరుగుతున్నాయి అనేది చాలా సార్లు వార్తల్లోకి వచ్చింది. చాలాసార్లు ఈ అవకతవకలకు సంబంధించి అధికారులపై చర్యలు కూడా చేపట్టింది ప్రభుత్వం. అయితే వృద్ధ  వయసులో ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్ చేయూతతో జీవితాన్ని వెళ్లదీసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారికి అధికారుల నిర్లక్ష్యం...  కారణంగా వృద్ధాప్య పింఛన్ అందకుండానే  పోతుంది. చాలామంది పింఛన్ కు సరిపడా వయస్సు  ఉన్నప్పటికీ కూడా పింఛన్ కి  అనర్హులుగా ఉంటున్నారు ఈ రోజుల్లో. 

 

 

 

 అయితే దీనిపై ప్రభుత్వం ఎంత దృష్టి పెట్టినప్పటికీ  కిందిస్థాయి అధికారుల నుండి  మాత్రం క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదు. దీంతో చాలా మంది పేద ప్రజలు సరిపడా వయస్సు ఉన్నప్పటికీ కూడా పింఛన్  అందుకోలేక పోతున్నారు . దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ... రెస్ట్ తీసుకుని వయసులో కూడా అధికారుల చుట్టూ తిరుగుతూ కష్టపడుతున్నారు  వృద్ధులు. ఇక ఇలాంటి ఘటన చోటుచేసుకుంది ఇక్కడ . 104 సంవత్సరాల ఓ భామ  ను ఏకంగా నాలుగు సంవత్సరాల వయసు గా మార్చారు అధికారులు. దీంతో ఆ వృద్ధురాలికి వృద్ధాప్య పింఛన్ ఆగిపోయింది . 

 

 

 కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం లోని జోలదరాసి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జోదాలరాశి గ్రామానికి చెందిన కాశిరెడ్డి అశ్వర్దమ్మ  వయస్సు 104 సంవత్సరాలు . కానీ అధికారులకు మాత్రం ఈ వృద్ధురాలు  నాలుగు సంవత్సరాల చిన్నారి కనిపించింది. దీంతో నాలుగేళ్ల చిన్నారి కి  పెన్షన్ ఎలా ఇస్తామంటూ... వృద్ధురాలికి వస్తున్న పెన్షన్  ను  నిలిపి వేశారు అధికారులు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు ఆ వృద్ధురాలు అర్హురాలు కాదని అంటు .. పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుంచి ఈ వృద్ధురాలి పేరు ను తొలగించారు.రీ  సర్వేలో ఈ వింత ఘటన  చోటుచేసుకుంది. తన వయసును నాలుగేళ్లుగా నిర్దారింఛి  తన పేరును పెన్షన్దారుల జాబితా నుంచి తొలగించి పెన్షన్ నిలిపి వేయడం అన్యాయమంటూ  ఈ నూట నాలుగు సంవత్సరాల వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: