టెక్నాలజీ రోజురోజుకు పెరిగిపోతోంది... టెక్నాలజీ పెరిగిపోవడం మాటేమో కానీ... కొంతమందికి  పిచ్చి కూడా బాగా పెరిగిపోతుంది. అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడిచ్చిన అందాన్ని కాదని ఆర్టిఫిషియల్ అందం కోసం పాకులాడుతున్నారూ  నేటితరం జనాలు. అందరూ తామే అందంగా కనిపించాలనే తపనతో అసలు వారు ఏం చేస్తున్నారో కూడా ముందు వెనుక ఆలోచించకుండా... రసాయనాలను వాడుతున్నారు. ఇంకేముంది ఉన్న అందం  పాయె... కొత్తగా అందం  వచ్చేది ఏమీ లేకపాయే... అందం పోయి  అందవికారంగా తయారవడం జరుగుతుంది. 

 

 

 

 అయితే ఇలాంటి రసాయనాల వాడకం వలన ఎన్నో  ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి పడుతున్నాయి.ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో  తెర మీదికి వచ్చాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అమ్మాయిని చూస్తే అందం కోసం జనాలు ఎంతగా ఆతృతగా ఉన్నారో  అర్థమవుతుంది. బల్గేరియా కు చెందిన 22 ఏళ్ల ఆండ్రియా ఇనోవా కు తన పెదవులు అంటే నచ్చేది కాదట. పెదవులు చిన్నగా ఉన్నాయని... పెద్దగా ఉంటే బాగుండు అని బాధపడేది..దీనికోసం  ఎప్పుడూ బాధపడుతూ ఉండేదట.. పెదవులను ఎలాగైనా పెద్దగా చేసుకునేందుకు చాలానే కష్టపడింది ఈ యువతీ . చాలా ప్రయత్నాలు కూడా చేసింది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే తన పెదవులకు 17సార్లు  హైయాలురోనిక్  ఇంజెక్షన్లు చేయించుకున్నది  ఈ యువతీ . ఇంకేముంది ఆమె పెదవులు ప్రపంచంలోనే అతిపెద్ద పెదవులు గా గుర్తింపు పొందాయి. 

 

 

 

 అక్కడితో ఆగింది అనుకుంటున్నారా... ప్రపంచంలోనే అతిపెద్ద పెదవులు గా గుర్తింపు పొందినప్పటికీ ఆ యువతికి మాత్రం సంతృప్తి చెందలేదట . ఒక ఇంజక్షన్ కోసం 134 పండ్లు అంటే మన రూపాయల్లో 12350 రూపాయలు ఖర్చు చేస్తుందన్నమాట. ఆమె తన పెదాలతో సంతృప్తి చెందక మరోసారి ఈ నెల చివర్లో మరో ఇంజెక్షన్ కూడా చేయించుకుంది. అయితే దీనిపై స్పందించిన ఆ యువతి పెదవులు పెద్దగా ఉండటం అంటే తనకు చాలా ఇష్టమని.... ఈ కొత్త పెదాలతో తాను ఎంతో సంతోషంగా ఉన్నా అంటూ చెప్పుకొచ్చింది . పెదవులు పెద్దదిగా ఉంటే చాలా అందంగా ఉంటారూ అంటుంది ఈ యువతీ . అయితే తన పెదవులు ఇలా కావడం కోసం బల్గేరియా రాజధాని సోఫియా లో ప్రతి క్లినిక్కు తిరిగానని  చెబుతోంది. ప్రస్తుతం తన పెదవుల్లో   ఎన్నో రకాల లిప్స్ పిల్లర్లు ఉన్నాయ్ అని చెప్పుకొచ్చింది యువతి.

మరింత సమాచారం తెలుసుకోండి: