అస్మా బేగం అనే 18 ఏళ్ల యువతికి తరచుగా నడుము నొప్పి రావడంతో  స్థానిక డాక్టర్‌ దగ్గరికి వెళ్లి.. మందులు వేసుకోవడంతో సరిపెట్టుకుంటుంది. ఇలా రెండేళ్లుగా వెన్ను నొప్పితో బాధపడుతోంది అస్మా బేగం.. ఇలా తరచుకుగా జరుగుతుండటంతో ఎక్స్‌రే తీయించారు.. అయితే మొదట ఏదో చిన్న వస్తువు ఉందని గుర్తించిన అక్కడి డాక్టర్లు.. చిన్న ఆపరేషన్ చేస్తే సరిపోతుందన్నారు.

 

 

దీంతో బేగంను నిమ్స్‌కి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ నిమ్స్ వైద్యులు తీరా ఆపరేషన్‌ చేశాక.. వాళ్లు బయటకు తీసిన వస్తువు చూసి అందరు ఆశ్చర్యపోయారు . అదేమంటే ఆ యువతి నడుములో ఉన్నది ఒక బుల్లెట్. సరిగానడుము లోంచి దిగి ఆ బుల్లెట్ కడుపు దగ్గర ఆగిపోయింది.  వెంటనే నిమ్స్ వైద్యులు పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుల్లెట్‌ ఎక్కడిది, ఎలా దిగింది అని తేల్చేందుకు ఫలక్‌నుమా పోలీసులు రంగంలోకి దిగారు.

 

 

ఏసీపీ మజీద్‌ యువతి ఇంటికి వెళ్లి అన్ని రకాలుగా విచారించగా.  అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.. అయితే నిజాన్ని దాచిన యువతి తల్లిదండ్రులు మాత్రం అమ్మాయికి ఎలాంటి బుల్లెట్‌ తగల్లేదని చెబుతున్నారు. నిజంగానే బుల్లెట్‌ శరీరంలో ఉండిపోతే.. ఆరోగ్యం పాడయ్యేదని చెబుతున్నారు. అలాంటిదేం జరగలేదు కాబట్టి.. హాస్పిటల్‌ వాళ్లే కావాలనే ఇలా చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.

 

 

ఇకపోతే నిమ్స్‌ వైద్యులు మాత్రం.. అస్మా బేగం శరీరంలో రెండు మూడేళ్లుగా బుల్లెట్‌ ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో రోజుకో తరహాలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసుపై ఫలక్‌నుమా, పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో మరో కోణం బయటపడింది. బాధితురాలు అస్మా బేగం తండ్రి నజీర్.. కింగ్స్ ఫంక్షన్ హాల్‌లో గత కొన్ని సంత్సరాలుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు..

 

 

అయితే ఇప్పుడు కింగ్స్ ఫంక్షన్ హాల్ ఓనర్ షన్ వాజ్ కొడుకు జుబేర్‌ వార్తల్లోకి ఎక్కాడు. గతంలో ఓ పెళ్లి బరత్‌లో జుబేర్ కాల్పులు జరిపాడు .. దీంతో జుబేర్ పై మైలార్‌దేవులపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.. అస్మా బేగం కేసుతో మరోసారి జుబేర్ కేసు వ్యవహారం బయటకు వస్తోంది. మరింత లోతుగా జుబేర్ కాల్పుల కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..  సోత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అస్మా బేగం కుటుంబ సభ్యులను దీనిపై లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: