మన భారత దేశం ఎంత గొప్పది అంటే ప్రతి మతస్దుడు గర్వంగా నేను భారతీయున్ని అని చెప్పుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ హిందు, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అనే తేడా లేకుండా వివిధ నెలల్లో వచ్చే వారి వారి పండగలను ఎంతో ఘనంగా జరుపుకునే మంచి ఆచారం ఉంది. దానికి తగ్గట్టుగానే క్రైస్తవులు జరుపుకునే క్రిస్‌మస్ పండగను కూడా భారతదేశం లో పెద్ద ఎత్తునే జరుపుకుంటారు.

 

 

ఇకపోతే డిసెంబర్ నెల వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. క్రిస్మస్ తో పాటూ న్యూ ఇయర్ వేడుకలు కూడా అంబరాన్నంటే విధంగా జరుపుకుంటారు. ఇక అలంకరణలకు పెద్దపీట వేసే ఈ పండుగ కోసం ఇండియాలో పలు ప్రముఖ క్రిస్మస్ మార్కెట్ లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ క్రిస్మస్ పండుగకు కావాల్సిన అన్ని అలంకరణ వస్తువులు లభిస్తాయి. ఇక ఆ క్రిస్మస్ మార్కెట్ లు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

 

భారతదేశంలో అత్యంత సందడిగా ఉండే పర్యాటక నగరాలు గోవా, పుదుచ్చేరి, షిల్లాంగ్.. ఇక గోవాలో క్రిస్మస్ షాపింగ్ చేయాలనుకునే వారికి అంజున ఫ్లీ మార్కెట్ మరియు కాలాంగూట్ సిఫార్సు చేయదగ్గ ప్రదేశాలు. షిల్లాంగ్ లో పోలీస్ బజార్, బర్రా బజార్, జి.ఎస్.రోడ్ లు క్రిస్మస్ షాపింగ్ కు పేరెన్నిక గల ప్రాంతాలు. హాలిడే మార్కెట్ గమ్యస్థానాలుగా ప్రఖ్యాతి గాంచిన ఈ ప్రదేశాల్లో క్రిస్మస్ అలంకరణ వస్తువులు, ఆహారం, హస్తకళలు, క్రిస్మస్ డిజైన్లు వంటివెన్నో లభిస్తాయి. ఇక బెంగళూరు సిటీలో దాదాపు 250 స్టాల్స్ ద్వారా వివిధ రకాల పండుగ కలెక్షన్ ను ఉంచేవారు. తరువాత క్రిస్మస్ డెకరేషన్ వస్తువులు, హస్తకళలు, ఇంట్లోనే తయారు చేసిన వస్తువులు, లేటెస్ట్ వెరైటీ క్రిస్మస్ డిజైన్లను, స్పెషల్ లైటింగ్ వంటివి కూడా స్టాల్స్ ద్వారా విక్రయిస్తున్నారు.

 

 

మరో చోటు ఢిల్లీ, ముంబై నగరాల్లో ఇండో జెర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఏర్పాటు చేసే ఎక్స్ మాస్ మార్కెట్ కు తప్పక వెళ్లాల్సిందే. డిసెంబర్ నెలలో మీరు కొచ్చిన్ లో ఉన్నట్లయితే క్రిస్మస్ వేడుకల కోసం ఏర్పాటు చేసే కొచ్చిన్ కార్నివాల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకండి. ఇకపోతే కలకత్తాలోని క్రిస్మస్ మార్కెట్ లలో మీకు విభిన్న రకాల వస్తువులు లభిస్తాయి. క్రిస్మస్ కరోల్స్, ఆహారం, క్రిస్మస్ కార్నివాల్స్ కు పార్క్ స్ట్రీట్ ఇక్కడ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. క్రిస్మస్ అంటే అలంకరణలతో పాటూ ఆహారానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: