రాష్ట్రంలో ఈవెంట్ల నిర్వహణ కోసం ఎక్సైజ్‌ ఫీజు భారీగా పెంచుతున్నట్లు ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరాన్ని కొత్తదనంతో స్వాగతిస్తూ హైదరాబాద్‌లో పాటు పలు ప్రాంతాల్లో ఈవెంట్లను నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవలి కాలంలో ప్రతి ఫంక్షను ఏదో ఒక కొత్త దనము ఉండాలి అనే ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రజల కోరికలకు తగినట్లుగానే కొత్త కొత్త ఈవెంట్స్ మార్కెట్ రంగంలో కొత్త దనము సంచరించు కుంటున్నాయి.

 

ఈ తరుణంలో గతంలో ఉన్న ఈవెంట్ల ఫీజును సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.9 వేలు ఉన్న ఫీజును దాదాపు రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షలకు పెంచినట్టు ఎక్సైజ్‌ శాఖ వర్గాలు వెల్లడించాయి. పెంచిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, అని కూడా దీనిని బట్టి ఈవెంట్స్ కోసము ప్రజలు ఎంత దనము ఖర్చు పెడుతున్నారు అనే విషయము మనకు అవగాహన అవుతున్నది. తదుపరి ఉత్త ర్వులు వచ్చేంతవరకు ఇవి అమల్లో ఉంటాయని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు.

 


ఇంతవరకూ ఎక్సైజ్ శాఖ కేవలము రూ.9 వేలే రూపాయలు మాత్రమే కట్టించుకునేది.. వాస్తవానికి గతంలో ఈవెంట్ల నిర్వహణకు చాలా తక్కువగా ఎక్సైజ్‌ ఫీజు వసూలు చేసేవారు. ఈవెంట్లకు హాజరయ్యే వారి సంఖ్య ఏ మాత్రము సంబంధం లేకుండా ఉండేది. అలాగే, ఇతర అంశాలతో సంబంధం లేకుండా జీహెచ్‌ఎంసీ పరిధిలో అయితే రూ.9 వేలు, మిగిలిన ప్రాంతాల్లో రూ.4,500 ఎక్సైజ్‌ ఫీజు కింద పన్ను వసూలు చేసేవారు. అంటే ఈవెంట్లలో మద్యం సరఫరా మిగిలిన ప్రాంతాల్లో రూ.4,500 ఎక్సైజ్‌ ఫీజు కింద వసూలు చేసేవారు. అంటే ఈవెంట్లలో మద్యం సరఫరా అనుమతికి గాను ఈ ఫీజు తీసుకునేవారు.

 

కానీ, చాలాకాలంగా ఈ ఫీజును సవరించకపోవడం, వల్ల ఈవెంట్ల నిర్వహణ ఖరీదు ఎక్కువ కావడంతో ఫీజును మరింతగా పెంచాలని రెండు నెలల క్రితం ఎక్సైజ్‌ శాఖ వారు ప్రతిపాదించడం జరిగింది.. ఈ మేరకు సాధారణ ఈవెంట్ల నిర్వహణకు గాను జీహెచ్‌ఎంసీ పరిధిలో.. రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. అదే స్టార్‌ హోటళ్లలో ఈవెంట్లను నిర్వహిస్తే దాన్ని రూ.9 వేల నుంచి రూ.20 వేలకు వరకు పెంచడం జరిగినది..

 

ఇక జీహెచ్‌ఎంసీ వెలుపలి ప్రాంతాల్లో.(ఊరి బయట)  సాధారణ ఈవెంట్లకు రూ.4,500 నుంచి రూ.9 వేలకు, స్టార్‌హోటళ్లలో అయితే రూ.4,500 నుంచి రూ.12వేలకు ఎక్సైజ్‌ ఫీజును పెంచడం జరిగినది.. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే కొత్త ఈవెంట్ యొక్క ఫీజు లు అందు బాటులోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: