తాజాగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదు అని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళల సమస్యలు అన్ని  ఎమ్మెల్యేకు తెలియ చేద్దామంటే  ఆమె కనిపించడం లేదు అని .. ఇల్లు, కార్యాలయం దగ్గర అక్కడ చుసిన కనిపించడం లేదు అని అంటున్నారు మహిళలు.ఇక మరో వైపు మా ఎమ్మెల్యేను వెతికి పెట్టండి సారు అని మహిళలు పోలీసుల్ని కోరడం జరిగింది. ఈ తరుణంలో మహిళలు తుళ్లూరు పోలీసులకు వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది.

 

ప్రస్తుతం రాజధాని విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టించిన సంగతి అందరికి తెల్సిందే కదా.. తాము ఆందోళనలో ఉన్నామంటున్నారు మహిళలు, రైతులు. సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసిన రోజు నుంచి తమ ఎమ్మెల్యే కనిపించడం లేదు అని తెలియచేస్తున్నారు. అసలు మా ఎమ్మెల్యే  ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదు అని.. ఆమెకు, మా ఇబ్బందుల్ని విన్నవించుకుందామంటే కనిపించడం లేదు అని అంటున్నారు మహిళలు. ఈ ముఖ్య కారణంతోనే  పోలీసులకు ఫిర్యాదు చేశాము అని మహిళలు అంటున్నారు.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TADIKONDA' target='_blank' title='tadikonda-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tadikonda</a> mla

 

ఇలా కనపడకుండా ఉండే లిస్టులో తాడికొండ  ఎమ్మెల్యే ఒకటే కాదు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపైనా రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని.. వెతికి పెట్టాలని పోలీసులను ఆశ్రయించడం జరిగింది. వీరు మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో నిడమర్రు రైతులు వెళ్లి  ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక  తాజాగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా  టార్గెట్ చేయడం జరిగింది.. ఆమె కనిపించడం లేదు అని పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు  ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు మహిళలు.

 

ఇక మూడు రాజధానులు ఉండొచ్చని సీఎం జగన్ తెలిపిన అప్పటి నుంచి, జీఎన్ రావు కమిటీ నివేదిక పూర్తి అయిపోయిన తర్వాత అమరావతి రైతులు ఆందోళను నిర్వహిస్తున్న సంగతి అందరికి  తెలిసిందే కదా. ఆ నిరసనల్లో ఇలా రైతులు, మహిళలు అందరు ఎమ్మెల్యేలు కనిపించడం లేదు అని పోలీసులకు ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. ఇక మరో వైపు అమరావతిలో మిగిలిన గ్రామాల్లో కూడా  ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: