ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరి నోటా వినిపిస్తున్న మాట ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం రాష్ట్రంలో మూడు రాజధాని ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రకటించగా... జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారాయి  అంతేకాకుండా రాష్ట్ర రాజధాని అధ్యయనం కోసం జగన్ మోహన్ రెడ్డి సర్కారు నియమించిన కమిటీ సైతం జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదిక అందించడంతో విపక్ష పార్టీల ని ఒక్కసారిగా జగన్ నిర్ణయం పై భగ్గుమన్నాయి. మూడు రాజధానిల నిర్ణయం వల్ల ప్రజాధనం వృథా కావడమే తప్ప అభివృద్ధి మాత్రం ఎక్కడా జరగదని  ఆరోపిస్తున్నాయి. 

 

 

 రాజధాని రైతులు కూడా తాము పంట భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేస్తే ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని అంటూ  జగన్ ప్రకటన చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా రాజధానిలో అంశంపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. భారీ వరద వచ్చినప్పటికీ రాష్ట్ర రాజధాని అమరావతి మునగ లేదు కానీ జగన్ గారి దొంగదెబ్బ కి మాత్రం అమరావతి మునిగిపోయినది అంటూ  లోకేష్ వ్యాఖ్యానించారు. నిండు సభలో గతం లో అమరావతి కి జై కొట్టారని కనీసం 30 వేల ఎకరాలు ఉంటే కానీ రాజధాని అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు అంటూ లోకేష్ వైసిపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

 

 

 రాజధాని అమరావతి లోనే  ఉంటుందని వైసీపీ మేనిఫెస్టో లో పెట్టారని... అమరావతి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని నమ్మబలికారు అంటూ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పుడు జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక...రాజధాని అమరావతి విషయంలో మాట మార్చి మడమ తిప్పి అమరావతి నిండా ముంచేసారు అంటూ టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు నారా లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: