మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నో రాజకీయ సమీకరణాలు ఎత్తులు పై ఎత్తుల తర్వాత చివరికి బిజెపి ప్రభుత్వం బల నిరూపణ చేసుకోలేక కూలిపోవడంతో... శివసేన కాంగ్రెస్ ఎన్సిపి పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజుల వరకు రాజకీయాలను మతంతో ముడిపెట్టి పెద్ద తప్పు చేశామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే  సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 ఏళ్లగా  బీజేపీతో కలిసి కొనసాగడం కూడా శివసేన చేసిన పెద్ద తప్పు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇన్ని రోజుల వరకు పక్క హిందూత్వ నినాదం తో శివసేన పార్టీని ముందుకు నడిపిన ఉద్దవ్ థాక్రే  తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందుత్వ నినాదాన్ని గాలికొదిలేసి ఎన్సీపీ కాంగ్రెస్ తో శివసేన పొత్తు పెట్టుకుంది అంటూ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 

 

 

 

 అయితే ప్రజా తీర్పు పై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడారని కానీ... ఇవి రాజకీయాలని ఉద్దవ్ థాక్రే  వ్యాఖ్యానించారు. రాజకీయాలు జూదం లాంటివని  సరైన రీతిలో రాజకీయాలను చేయాలి అంటూ హితవు పలికారు ఆయన. ఈ విషయాలను ఇన్నాళ్లు తాము మరిచిపోయి మతంతో రాజకీయాలను ముడి  పెట్టామని... దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని ఇన్నెల్లు అనుభవించానని ఉద్దవ్ థాక్రే  వ్యాఖ్యానించారు. కేవలం హిందుత్వ సిద్ధాంతం కోసమే 25 ఏళ్లు బీజేపీతో కలిసి పని చేసామని ఆయన తెలిపారు. అయితే తాము మతాన్ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మార్చుకోలేదని నిన్న ఈరోజు రేపు కూడా తాము హిందువులమే అంటూ ఆయన తెలిపారు. 

 

 

 

 రాజకీయ అవసరాల కోసం వేర్వేరు సిద్ధాంతాలు ఉన్న  కొంతమందితో బిజెపి చేయి కలిపినది  అంటూ ఆయన విమర్శించారు. పొత్తు  ధర్మం గురించి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడితే సరిపోతుంది దానికి కట్టుబడి ఉండాలంటూ వ్యాఖ్యానించారు. మతం అనేది పుస్తకాల్లోనే  కాదు మన నిజ జీవితంలో కూడా ఉండాలని ఆయన తెలిపారు. అయితే మహారాష్ట్రలో బుల్లెట్ రైలు ప్రయాణించే వారి కోసం కాకుండా రిక్షాలో వెళ్లే వారి కోసమే తమ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలు మహా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: