ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ ఎంతైనా అవసరం... రాష్ట్రంలో అభివృద్ధి ఒకేచోట ఆగిపోకుండా రాష్ట్రం మొత్తం జరగాలి.. దీని కోసం రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానిల నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి. మూడు రాజధానిల నిర్మాణం అంటూ జగన్ ప్రజాధనాన్ని వృధా చేయడానికి డ్రామా ఆడుతున్నారని విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

 

 

 

 అంతేకాకుండా జగన్ ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయంపై అమరావతి రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. తాము మూడు పంటలు పండించుకునే భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి నుంచి మారుస్తామని ప్రకటన చేయడం దారుణమని దీని ద్వారా తమకు అన్యాయం జరుగుతుంది అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా అమరావతి రైతులు  గత కొన్ని రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు సైతం చేపడుతున్నారు. అమరావతి రైతుల నిరసనలు ఆందోళనలతో ఒక్కసారిగా అమరావతి మొత్తం హాట్ హాట్ గా మారింది. 

 

 

 

 ఇక రాజధాని అధ్యయనం కోసం జగన్ నియమించిన కమిటీ కూడా జగన్ నిర్ణయానికి సమర్థిస్తూ నివేదిక అందించినట్లు సమాచారం ఇకపోతే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నిర్ణయంపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ అండ్ కో దౌర్జన్యాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ బ్రాంచ్ లు  స్థాపించడానికి ముందుకొచ్చినా కంపెనీలు అని వెనక్కి వెళ్లిపోయారని నారా లోకేష్ ఆరోపించారు. ఒకవేళ ఆ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఉంటే ఎంతో మంది పేద ప్రజలకు ఉపాధి ఉండేది అని నారా లోకేష్ అన్నారు . కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో 3 రాజధానిలతో  అభివృద్ధి అంటూ కొత్త అంశాన్ని తెరమీదికి తెచ్చారు అంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు. తన పాలనతో  ప్రజలను సంతృప్తి పరచలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. ప్రజల దృష్టి మళ్లించటానికి  జగన్ ప్రయత్నిస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు నారా లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: