ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభివృద్ధి వికేంద్రీకరణ (డెవలప్‌ మెంట్ డీ సెంట్రలైజేషన్) పై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం లోని నిట్ స్నాతకోత్సవంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు విపరీతంగా వలసలు పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా డెవలప్ చేయాలని ఆయన కోరారు.  

 

ఎక్కువ విద్యార్థులు, పేద కుటుంబాలు విద్య, వైద్య, ఉపాధి అవకాశాల కారణంగానే ఎక్కువ మంది పట్టణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివాలరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెంకయ్య నాయుడు అభిప్రాయ పడ్డారు. అభివృద్ధి కేవలం జిల్లా ప్రాంతాలకే పరిమితం కాకూడదని.. గ్రామీణ ప్రాంతాలలో కూడా సమానంగా అభివృద్ధి చెందాలని ఆయన ఈ వేదికగా ఆకాంక్షించారు. 

 


అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే తాడేపల్లి గూడెంలో నిట్ సంస్థను నెలకొల్పినట్లు ఉప రాష్ట్రపతి వెల్లడించారు. నిట్‌ ను తూర్పు గోదావరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రతి పాదనలు వచ్చినప్పటకి.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే తాడేపల్లి గూడెంలో నిట్ ఏర్పాటు చేసినట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు.

 


అయితే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న వెంకయ్య నాయుడు.. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న మూడు రాజధానుల వ్యవహారంతో సంబంధం ఆయన లేదని స్పష్టం చేశారు. అది అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయమని.. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తమకి ఎలాంటి సంబంధం లేదని అయన తేల్చేశారు. డెవలప్‌ మెంట్ డీ సెంట్రలైజేషన్ ద్వారా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసి వలసలను నివారించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: