ఆంధప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పేదల సమస్యలని పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మనకందరికీతెలిసిందే. ఈ స్పందన కార్యక్రమంలో ఇప్పటికే కొంతమంది పలు ప్రజలు, ఉద్యోగులు సంచలనమైన ఫిర్యాదులు చేయడము గమనార్హం. ముఖ్యముగా ఈ విషయము. ఏమీ అంటే  ప్రభుత్వ అధికారులే  రాజకీయ నేతలపై, వారి బంధువుల పై ఫిర్యాదులు చేస్తుండటం తో స్పందన పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్ట వలసి వస్తుంది.

 

తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడిపై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాలలో గొప్ప సంచలనం రేకెత్తించింది. తమ భూమినే  కబ్జా చేశారంటూ ఒక జాయింట్ కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేయడము. ఎంతవరకు సబబు అనిపిస్తుంది.ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ గారి సోదరుడు అయినటువంటి ఆదినారాయణ గారే తమ భూమిని కబ్జా చేశారని భూమిని పోగొట్టుకున్నా బాధితులు ఆరోపిస్తున్నారు.. ఆదినారాయణ పై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో అధికారుల్ని కోరడం జరిగినది ‌.

 

విజయనగరంలోని సత్యసాయినగర్ లే అవుట్ లోని సర్వే నెంబరు 53-4 53-5లలో కొంత స్థలాన్ని బాధితులైన కిరణ్ బి.రాజేష్ టీఏ సూర్యనారాయణ అశోక్ కుమార్, వాసవి పద్మావతి గోవిందమ్మ ,ఎప్పుడో తాము కొనుగోళ్లు చేశామని తామంతా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారమని ఎన్నో ఏళ్లు కష్టపడి ఈ స్థలాన్ని తీసుకుకొనుకున్నామని ఇప్పుడు ఆ స్థలాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ గారి సోదరుడు ఆదినారాయణ కబ్జా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.

 

అని స్పందన లో అధికారుల ముందు తమ గోడుని విన్న విన్ చుకున్నారు.. లేఔట్లోని ప్లాట్స్ను కబ్జా చేశారని.. తమ లేఔట్ కు అన్ని అనుమతులు ఉన్నా తమ స్థలాల చుట్టూ ప్రహరీ గోడ కట్టారని ఇది ఎంతవరకు భావ్యము అని బాధితులు ఆరోపణలు చేశారు ఆదినారాయణపై తగినటువంటి చర్యలు తీసుకోవాలని.స్పందన కార్యక్రమం లో బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ భూమిని రక్షించి కాపాడలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: