మహారాష్ట్ర లో ఎన్నికల్లో బీజేపీ  శివసేన  కలిసి పోటీ చేసాయి కానీ అధికారాన్ని చేజిక్కిచ్చుకొనే విషయం కి వచ్చేసరికి  విభేదాలు వచ్చి రెండు పీఏటీలు విడిపోయాయి బీజేపీ తో స్నేహము కటీఫ్ కాగానే శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే బిజెపి పార్టీ విధి విధానాల నుంచి కూడా బయటపడుతున్నారు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వపు నిర్ణయాలను కూడా సమీక్ష చేసుకుంటూ బీజేపీ కి షాకుల మీద షాకులు ఇవ్వడం జరుగుతున్నది..

 

దేశం అంతటా జాతీయ పౌర చట్టం (ఎన్నార్సీ)ని అమలు చేసేందుకు బీజేపీ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అక్రమ వలసదారుల కోసం నిర్భంధ మైన  కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారుఇదే వరుసలో మొన్నటివరకూ మహారాష్ట్ర ను పాలించిన బీజేపీ సీఎం ఫడ్నవీస్ మహారాష్ట్ర లోని నెరుల్ ప్రాంతంలో అక్రమ వలస దారుల కోసం నిర్బంధ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం లో ప్రతిపాదించడం జరిగినది..

 

తాజాగా ఫడ్నవీస్ ప్రతిపాదించిన నిర్బంధ కేంద్రాలు అవసరము లేదని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మంగళం పాడారు. మహారాష్ట్ర లో నిర్బంధ కేంద్రాలకు ఇకనుంచి అనుమతించేది లేదని విషయాన్ని స్పష్టం చేశారు. నిర్బంధ కేంద్రాలను రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించి సంచలనం సృష్టించారు. సుప్రీం కోర్టు లో 22న ఎన్నార్సీ పై విచారణ జరగనుందని. తెలియజేశారు.

 

ఆ తీర్పు వచ్చిన తర్వాతే ఈ ఎన్నార్సీ నిర్బంధ కేంద్రాల పై తమ నిర్ణయం వెల్లడిస్తానని ఉద్దవ్ స్పష్టం చేశారు. దీంతో ఎన్నార్సీ ముందుకెళుదామనుకున్న బీజేపీ కి ఈ విషయము మరి షాక్ తగిలింది.ఏమైనా గానీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ బిజెపి పార్టీకి షాక్ ఇవ్వడంతో ఎం ఆర్ సి విషయములో ముందుకు వెళ్తాము అన్న ఆలోచన వాయిదా పడటంతో బిజెపి నాయకులకు ఒక తలనొప్పిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: