తెలుగుదేశంపార్టీ ఫిరాయింపు బిజెపి రాజ్యసభ ఎంపి సుజనా చౌదరికి సాక్ష్యాత్తు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ పెద్ద షాకే ఇచ్చారు.  సుజనాపై చాలా ఆర్ధిక నేరారోపణలున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయనపై సిబిఐ, ఎన్ఫోర్సు మెంటు డైరెక్టరేట్, ఐటి శాఖల ఉన్నతాధికారులు ఎన్నోసార్లు దాడులు కూడా చేశారు. అటువంటి సుజనాపై వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని రాష్ట్రపతి కేంద్ర హోంశాఖను ఆదేశించటం సంచలనంగా మారింది.

 

ఇంతకీ రాష్ట్రపతి కార్యాలయం సుజనా ఆరోపణలపై ఎందుకు స్పందించింది ?  ఎందుకంటే వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. సుజనాపై ఉన్న ఆర్ధిక నేరాల చిట్టా మొత్తాన్ని విజయసాయి రాష్ట్రపతి ముందుంచారు.  ఇవే కేసులపై గతంలో  నాంపల్లి కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసిన విషయం, ఏ ఏ బ్యాంకులో సుజనా ఎంతెంత రుణం తీసుకున్నది ? ఎంత ఎగొట్టారు ? ఆ కేసుల ప్రస్తుత పరిస్ధితి ఏమిటి ? అన్న విషయాలన్నింటినీ పూసగుచ్చినట్లుగా రాష్ట్రపతికి వివరించారు.

 

విజయసాయి ఫిర్యాదును పరిశీలించిన తర్వాత  ఫిరాయింపు ఎంపి చరిత్రను తవ్వమని, విచారించమంటూ రాష్ట్రపతి కార్యాలయం కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఒక ఎంపిపై ఉన్న ఆరోపణల విషయాన్ని విచారణ చేయించమని సంబంధిత శాఖకు రాష్ట్రపతి కార్యాలయం పంపటం చాలా అరుదనే చెప్పాలి. అందులోను ప్రస్తుతం సుజనా బిజెపిలోనే ఉన్నారు.

 

ఫిరాయింపు ఎంపి టిడిపిలో ఉన్నపుడు చేసిన మోసాలు, తనమీద కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎటువంటి  దాడులు చేయకుండా చంద్రబాబునాయుడుతో చెప్పి సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్న విషయాన్ని కూడా విజయసాయి వివరించినట్లు సమాచారం. అన్నీ ఫిర్యాదులను, వాటికి జత చేసిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే విచారణకు  రాష్ట్రపతి కేంద్ర  హోంశాఖను ఆదేశించినట్లు సమాచారం.  అంతా బాగానే ఉంది కానీ రాష్ట్రపతి కార్యాలయం నుండి కేంద్ర హోంశాఖను ఆదేశించమని చెప్పినంత మాత్రాన విచారణ  జరుగుతుందా ? అన్నదే సస్పెన్సుగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: