అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధాని   విషయం ఫై సంచలన నిర్ణయం వెలువడించారు రాష్టానికి  మూడు  రాజధానులు వస్తే అభివృద్ధి అనేది రాష్టం అంతటా  సమంగా జరుగుతుందని మాట్లాడారు ఈ విషయంఫై రాష్టం అంతటా భిన్న అభిప్రాయాలు  వెలువడుతున్నాయి బీజేపీనేత అభివృద్ధి వికేంద్రీకరణ (డెవలప్‌మెంట్ డీ సెంట్రలైజేషన్)పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని నిట్ స్నాతకోత్సవంలో వెంకయ్య మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోతున్నాయని ఆవేదన పడ్డారు.

 

విద్య, వైద్య, ఉపాధి అవకాశాల  సంబంధించి సదుపాయాలు సరిగి లేని కారణంగానే ఎక్కువ మంది పట్టణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టం చూపుతున్నారని వ్యాఖ్యానించారు.గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నిలవరించాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు మాట్లాడారు  అభివృద్ధి అనేది కేవలం జిల్లా ప్రాంతాలకే  పరిమితం కాకూడదని.. గ్రామీణ ప్రాంతాల్లో  కూడా సమానంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం  ఎంతయినా ఉందన్నారు.

 

అందులో భాగంగానే తాడేపల్లి గూడెంలో నిట్ సంస్థను కూడా నెలకొల్పినట్లు ఉప రాష్ట్రపతి వెల్లడించారు. నిట్‌ను తూర్పు గోదావరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే తాడేపల్లి గూడెంలో నిట్ ఏర్పాటు చేసాము అని  వెంకయ్య చెప్పారు.

 

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న వెంకయ్య ఇప్పుడు ఏపీలో జరుగుతున్న మూడు రాజధానుల వ్యవహారంతో సంబంధం లేదని అభివృద్ధి వికేంద్రీ కారణకు ఎటువంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు.అది అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయమని.. రాజధాని ఎక్కడ ఉండాలి అనే  విషయం గురించి  ప్రభుత్వం  దే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. . డెవలప్‌మెంట్ డీ సెంట్రలైజేషన్ ద్వారా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసి వలసలను నివారించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: