రాష్ట్రానికి మూదు రాజధానుల కాన్సెప్టుపై ఒకవైపు రచ్చ జరుగుతుండగానే మొత్తం 13 జిల్లాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఏ ఏ జిల్లాలు ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి ?  విద్యాసంస్ధలను ఎక్కడ పెట్టాలి ? అనే పద్దతిలో గట్టిగానే అధ్యయనం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 27వ తేదీన జరగనున్న క్యాబినెట్ సమావేశంలో  మూడు రాజధానుల విషయమై నిర్ణయం తీసుకున్నట్లుగా తన మాస్టర్ ప్లాన్ ను కూడా జగన్  వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

 

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయించాలని డిసైడ్ అయ్యారట. కిడ్నీ ఆసుపత్రి నిర్మాణానికి ఇప్పటికే శంకుస్ధాపన కూడా చేసిన విషయం తెలిసిందే. అలాగే విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో పాటు మూడు పెద్ద ఆసుపత్రులను ఏర్పాటుకు ఆలోచిస్తున్నారట. గిరిజన యూనివర్సటి ఏర్పాటును స్పీడ్ చేయాటానికి రెడీ అవుతున్నారు.

 

విశాఖపట్నం సిటి ఇప్పటికే బాగా అభివృద్ధి జరిగింది కాబట్టి రాజధాని మాత్రం సరిపోతుందని అనుకుంటున్నారట. అయితే జిల్లాలొని అరకు, లంబసింగి, పాడేరు ప్రాంతాలను టూరిజం హబ్ గా అభివృద్దికి ప్లాన్లు వేస్తున్నారట.  తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా  పెట్రోసెజ్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారట. పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటమే టార్టెట్ గా పెట్టుకున్నారు.  కృష్ణా జిల్లాలో బందరుపోర్టు, గుంటూరు జిల్లాలో అసెంబ్లీ, రాజ్ భవన్ తో పాటు విద్యాసంస్ధల కేంద్రంగా అభివృద్ధికి ప్రణాళికలు రెడీ అవుతున్నాయి.

 

ఇక ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు, నెల్లూరులో కృష్ణపట్నంకు అదనంగా దుగరాజపట్నంపోర్టు ఏర్పాటు  చేద్దామని అనుకుంటున్నారట. అలాగే నెల్లూరు+చిత్తూరు జిల్లాల్లో కలిపి బిహెచ్ఇఎల్ కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.  అనంతపురం జిల్లాలో రాడార్ , సోలార్ పవర్ ప్లాంట్లు, కర్నూలు జిల్లాలో  హైకోర్టు, సోలార్, విండ్ మిల్ యూనిట్లు  ఏర్పాట్లు చేయటానికి ప్లాన్ రెడీ చేస్తున్నారు.

 

కడపలో స్టీలు ఫ్యాక్టరీతో పాటు పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు రెడీ అవుతాయి. ఇవి కాకుండా ప్రైవేటు కంపెనీలు తమకు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే అక్కడ వెంటనే  సౌకర్యాలు కల్పించాలని డిసైడ్ చేశారట. ఈ అభివృద్ధి సూత్రాన్నే తొందరలో ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: