హైదరాబాద్ మెట్రో రైల్ ద్వారా ప్రయాణించడానికి టికెట్ కొనడం ఇప్పుడు మరింత సులభం అయింది. ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ మేక్‌ మైట్రిప్ (ఎమ్‌ ఎమ్‌ టి) తో కలిసి ఎల్ అండ్ టి మెట్రో  రైల్ (హైదరాబాద్) సహకారంతో క్యూ ఆర్  కోడ్ ఆధారిత  ఇ-టిక్కెట్లను సోమవారం   ప్రవేశపెట్టింది.   టికెట్ బుకింగ్ ఎంపిక, మేక్ మైట్రిప్ (ఎమ్ ఎమ్ టి)  వెబ్‌సైట్, యాప్‌ ల ద్వారా టికెట్ బుక్  చేయవచ్చు.ఈ ప్రక్రియ  టికెట్ కౌంటర్ల వద్ద క్యూను నివారించడానికి ప్రయాణీకులకు సహాయ పడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా  టికెట్లను ముందే బుక్ చేసుకోవచ్చు,  ఈ  ప్రక్రియ నగదు రహితంగా ఉంటుంది.

                                     

 

 

 

 

 

 

 

 

 

 

 

ఒక  లావాదేవీలో ఇ-టిక్కెట్లను స్వీయ లేదా గరిష్టంగా ఆరుగురు ప్రయాణికుల కోసం బుక్ చేసుకోవచ్చు. ఆరు క్యూ ఆర్ కోడ్‌ లను వాట్సాప్ ద్వారా ఇతరులతో పంచుకోవచ్చు. ట్రావెల్ అండ్ టికెటింగ్ పోర్టల్ ప్రకారం భారతీయ మెట్రో ఇ-టికెట్ బుకింగ్ విధానంలో ఇది మొదటిసారి తెరిచిన కార్యాచరణ. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ వి  యస్  రెడ్డి మాట్లాడుతూ 20 స్టేషన్ల మధ్య ప్రయాణానికి ఇ-టికెట్ ఎంపికను అందుబాటులో ఉంచామని,  వచ్చే నెలలో, తెరవడానికి సిద్ధంగా ఉన్న కొత్త, మూడవ కారిడార్‌తో సహా మొత్తం 49 స్టేషన్లు, ప్రయాణీకులను ఇ-టికెట్లతో నిర్వహించడానికి సన్నద్ధమవుతాయి అని పేర్కొన్నారు.

 

 

 

 

 

 

స్మార్ట్ కార్డ్ లేనివారు మరియు కౌంటర్ వద్ద టికెట్ కొనడానికి క్యూలో నిలబడవలసిన వారికి ఇ-టికెట్ ఎంపిక ఉపయోగ పడుతుంది.  కొంత కాలానికి స్మార్ట్‌కార్డ్ యూజర్లు కూడా కొత్త ఆప్షన్‌కు మారాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ వాట్సాప్ సందేశాన్ని ఎవరు కూడా  ఉద్దేశించని వారితో పంచుకోవద్దని ఎన్ వి యస్  రెడ్డి హెచ్చరించారు.  ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య రీతిలో అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి సదుపాయంగా ఇది నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: