రాజధాని ప్రాంత రైతులు గత కొన్ని రోజుల అమరావతి విషయంలో ఆందోళన చేస్తున్నారు.  రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రసక్తి లేదని అంటున్నారు.  రాజధానిని తరలిస్తే చాలా ఇబ్బందులు వస్తాయని, తరలించ కూడదని అంటున్నారు.  తాము 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చామని, అప్పట్లో అమరావతిని రాజధానిగా చేస్తామని చెప్పిన అప్పటి టీడీపీ ప్రభుత్వం, అప్పట్లో అమరావతికి జై కొట్టిన వైకాపా అందరు కలిసి తమను మోసం చేశారని, రాజధానిని అక్కడి నుంచి తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని రోడ్డుమీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు.  


ఈ ఆందోళనతో అమరావతి రణరంగంగా మారింది.  ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు.  ఈ సందర్భంగా ఆయన్ను రాజధాని ప్రాంత రైతులు కలిశారు.  వినతి పత్రాలు అందజేశారు. తమ గోడు వినాలని, రాజధానిని మార్చకుండా చూడాలని ఉపరాష్ట్రపతి రైతులు విజ్ఞప్తి చేశారు.  రైతుల బాధలు తనకు తెలుసునని, రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారని, తప్పకుండా రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని ఉపరాష్ట్రపతి హామీ ఇచ్చారు.  


రైతులు అందజేసిన లేఖలను ఆయన తీసుకున్నారు. హామీ ఇచ్చారు బాగానే ఉన్నది.  మరి దీనిపై జగన్ తో మాట్లాడి వెంకయ్య నాయుడు ఒప్పించగలుగుతారా? వెంకయ్య నాయుడు చెప్తే జగన్ వింటాడా? అంటే ఖచ్చితంగా వినరు.  ఎందుకంటే ఉపరాష్ట్రపతి సలహా మాత్రమే  కొన్ని సూచనలు మాత్రమే చేయగలరు.  అంతకు మించి మరొకటి చేయలేరు.  ఆ అధికారం ఉపరాష్ట్రపతికి లేదు.  


అంతెందుకు రాజధాని విషయం అన్నది కేంద్రం చేతుల్లో ఉండదు.  రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలి.  రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుంది.  అందుకే జగన్ ధైర్యంగా మూడు రాష్ట్రాల వ్యవహారం తెరమీదకు తీసుకొచ్చారు.  మూడు చోట్ల రాజధానులు అంటున్నారు.  అవి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే విషయం తెలియాల్సి ఉన్నది.  ఎందుకంటే మూడు ప్రాంతాల్లో మూడు రాష్ట్రాలు అంటే దాని వలన వచ్చే టెక్నికల్ ఇబ్బందులు కావొచ్చు, లేదంటే నిర్వహణ వ్యయం కావొచ్చు చాలా పెరిగిపోతుంది.  సమన్వయ లోపం కూడా ఉండే అవకాశం ఉంటుంది.  మరి చూద్దాం ఎమౌంతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: