మాట త‌ప్ప‌ను.. మ‌డ‌మ తిప్ప‌ను.. అని చెప్పే సీఎం జ‌గ‌న్ రాజ‌ధాని విష‌యంలోనూ అదే స్థాయిలో త‌న దూ కుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో రాజ‌ధాని ఏర్పాటు దిశ‌గా అడుగులు వేస్తు న్న జ‌గ‌న్‌.. నిర్ణయంపై అమ‌రావ‌తిలో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ‌స్తున్నాయి. రైతులు పెద్ద ఎత్తున ఉద్య‌మిం చారు. రాజ‌కీయ నాయ‌కులు త‌లోర‌కంగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కావాలంటూనే .. జ‌గ‌న్ నిర్ణ యాన్ని మాత్రం త‌ప్పుప‌డుతున్నారు. రాజ‌ధానిని  వికేంద్రీక‌రిస్తారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

 

అయితే, వాస్త వానికి రాష్ట్రంలోని సీమ‌, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి జ‌ర‌గాల‌ని అంద‌రూ కోరుతున్నారు.
కానీ, రాజ‌ధానిని మాత్రం ఒక ద‌గ్గ‌రే పెట్టాల‌ని కోరుతున్నారు. దీనివ‌ల్ల సంప‌ద‌మొత్తం ఒకే చోట కేంద్రీకృ తం కాదా? అనే ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం లేదు. దీంతో అస‌లు రాష్ట్రంలో ఎక్క‌డో ఒక చోట కీలక నిర్ణ యం తీసుకుని ముందుకు వెళ్తే త‌ప్ప‌.. అభివృద్ధి అనేది వెనుక‌బ‌డిన జిల్లాల‌కు అందే అవ‌కాశం లేనేలే దు. ఆ నేప‌థ్యంలో జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాన్ని మేధావులు స్వాగ‌తిస్తున్నారు.

 

అయితే, దీనికి ప్ర‌తి ప‌క్షాలు వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయ రంగు, కులాల రంగు పుల‌మ‌డంతో మేధావులు స‌హా విద్యావంతులు మా కెందుకు లే ఈ ర‌గ‌డ‌! అని ప‌క్క‌కు త‌ప్పుకొంటున్నారు. దీంతో విష‌యం ప‌క్క‌దారి ప‌ట్టినా స‌రిచేసే నాధు డు క‌నిపించ‌డం లేదు. ఇదిలావుంటే, సీఎం జ‌గ‌న్ మాత్రం త‌న దూకుడును ఎక్క‌డా త‌గ్గించ‌లేదు. తాను అసెంబ్లీలో పేర్కొన్న విధంగా విశాఖ‌లోనే పాల‌నా రాజ‌ధానిని ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈక్ర‌మంలోనే ఈ నెల 27న రాష్ట్ర కేబినెట్ స‌మావేశాన్ని ఆయ‌న విశాఖ‌లో ఏర్పాటు చేశారు.

 

నెల‌కు రెండు సార్లు కేబినెట్ మీటింగ్ జ‌ర‌ప‌డంలో భాగంగా దీనికి ఈ ద‌ఫా విశాఖ‌ను ఎంచుకోవ‌డంతో జ‌గ‌న్ ఈ విష‌యంలో ఎట్టి ప‌రిస్థి తిలోనూ వెన‌క్కి త‌గ్గే ప్రస‌క్తిలేద‌ని తెలుస్తోంది. ఈ కేబినెట్ స‌మావేశంలో రాజ‌ధాని స‌హా రాష్ట్ర అభివృద్ధిపై జీఎన్ రావు ఇటీవ‌ల ఇచ్చిన నివేదిక‌పై చ‌ర్చించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌టించింది. సో.. దీనిని బ‌ట్టి జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌ని తెలుస్తోంది. మ‌రి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: