ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ మహాదీక్ష చేపట్టింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా దీక్ష చేపట్టారు. ఆర్. కృష్ణయ్య ఈ దీక్షకు సంఘీభావం తెలపగా మందకృష్ణ ఈ దీక్షలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రకుల నాయకులలో మహిళల పట్ల కులతత్వం కనిపిస్తోందని మందకృష్ణ అన్నారు. 
 
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులపై చూపించిన వైఖరి అణగారిన వర్గాల మహిళలను అత్యాచారం చేసిన వారి విషయంలో కూడా చూపించాలని అన్నారు. అగ్ర కులాల వారు అగ్ర కులంలో మహిళ పట్ల అత్యాచారం జరిగితే మాత్రమే స్పందిస్తారని అన్నారు. గడచిన 15 సంవత్సరాలలో దేశంలో 3,41,000 మంది మహిళలపై అత్యాచారం జరిగిందని కానీ దిశ అత్యాచారం కేసు నిందితులను మాత్రమే ఎందుకు ఎన్ కౌంటర్ చేశారని మందకృష్ణ ప్రశ్నించారు. 
 
మందకృష్ణ ఏపీలో 70 శాతం అత్యాచారాలకు రెడ్డి సామాజికవర్గమే కారణమని జగన్ వారిని కాపాడుతున్నారని అన్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను సీఎం జగన్ సమర్థించటాన్ని మందకృష్ణ తప్పుబట్టారు. గుంటూరులో 5 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం జరిగిందని జగన్ వారిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయలేదని మందకృష్ణ ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో దిశ చట్టం తీసుకొచ్చిన రోజే అత్యాచారం జరిగిందని వారిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయలేదని మందకృష్ణ ప్రశించారు. 
 
అణగారిన మహిళలపై అత్యాచారాలు జరిగితే ఎందుకు ఎన్ కౌంటర్ చేయరని మందకృష్ణ ప్రశ్నించారు. రహస్య ఆదేశాల వలనే దిశ ఘటనలో ఎన్ కౌంటర్ చేశారని బూటకపు ఎన్ కౌంటర్ పై నిరసన తెలుపుతామని మందకృష్ణ చెప్పారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో అనేక అనుమానాలు ఉన్నాయని మందకృష్ణ అన్నారు. దిశ ఘటనకు కొన్ని రోజుల ముందు మానస, టేకు లక్ష్మిలపై అత్యాచారాలు జరిగాయని ఈ కేసులలో దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: