గత కొన్ని రోజులుగా పౌరసత్వం చట్టంపై దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి.  పౌరసత్వం చట్టం కారణంగా దేశంలో సామాన్యులు ఇబ్బందులు పడతారని, హిందూ ముస్లింలుగా దేశం విడిపోతుందని చెప్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.  కొంతమంది శాంతియుతంగా చేస్తున్న నిరసనల మధ్యలోకి అరాచక శక్తులు ప్రవేశించి విధ్వంసాలు సృష్టిస్తున్నాయి.  అల్లర్లు చేస్తున్నాయి.  దీనికి సంబంధించి దేశంలో అనేక కేసులు నమోదు అవుతున్నాయి.  


పౌరసత్వం చట్టం విషయంలో కేంద్రం ఓ స్పష్టమైన అంశం చెప్పింది.  ఈ చట్టం కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకు మాత్రమే ప్రవేశపెట్టబడిన చట్టం అని, దీనిని హిందూ ముస్లింలకు సంబంధం లేదని స్పష్టం చేసింది.  కానీ, కేంద్రం చెప్పిన మాటలను పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.  


ఈ ఆందోళనలు మధ్యలో దూరిన కొంతమంది అరాచక శక్తులు దారుణాలకు పాల్పడుతున్నాయి.  ఇందుకు ఓ ఉదాహరణ మంగళూరు ఘటన.  కర్ణాటకలోని మంగళూరులో పౌరసత్వం చట్టానికి వ్యతిరేకంగా నిరసలు తెలియజేస్తున్న ఆందోళనకారులోని కొందరు పోలీసులపై రాళ్ళూ రువ్వారు.  ఈ దృశ్యాలు  ఆ చుట్టుపక్కల ఉన్న సిసి టీవీల్లో రికార్డ్ అయ్యాయి.  


అయితే, కొంతమంది ముసుగు ధరించిన వ్యక్తులు సిసి టీవీలను పగలకొట్టి, వాటిని పక్కకు తిప్పి రాళ్లు రువ్వారు.  ముఖాలకు కర్చీఫ్ కట్టుకున్న వ్యక్తులు ఆ సిసి టీవీల్లో రికార్డ్ అయ్యారు.  ఈ ఫ్యూటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  దీంతో అరాచక శక్తులు ఆందోళనకారుల మధ్యలో దూరి ఎలాంటి ఆందోళనలు చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.  ఈ ఆందోళనలు రోజురోజుకు ఉదృతం చేస్తున్నారు.  పోలీసులపై రాళ్లు రువ్వుతూ, జాతీయ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.  ఇన్ని చేస్తున్నా కాంగ్రెస్ మాత్రం వారిని వరించడం లేదు.  పైగా ఆందోళనలు, నిరసనలను ఉదృతం చేస్తున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: