ఈమధ్య సెల్ ఫోన్ వాడకం మరీ ఎక్కువైపోయింది. సెల్ఫోన్ లేకుండా నాలుగు ఐదు నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి బాత్ రూమ్ కి వెళ్ళిన సెల్ ఫోన్ ని తీసుకొని వెళ్తుంటారు చాలామంది. అయితే సెల్ఫోన్ రాకతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు  ఉన్నాయి. సెల్ఫోన్ రాకతో ఎక్కడికి వెళ్లకుండా.. ఎక్కడ ఉన్న వారితో నైనా సాఫీగా  మాట్లాడుకోవడానికి వెసులుబాటు ఉంటుంది . ప్రపంచాన్ని మొత్తం స్మార్ట్ ఫోన్ ద్వారా మన అరచేతిలోకి తీసుకురావచ్చు. కానీ కొంతమంది మాత్రం సెల్ ఫోన్ కి బాగా ఎడిక్టు  అయిపోతున్నారు.సెల్ ఫోన్  లేకుండా ఒక్క నిమిషం ఉన్న పిచ్చి వాళ్ళలా  ప్రవర్తించడం చేస్తున్నారు. సెల్ఫోన్ లోనే  జీవితం మొత్తం  బతికేస్తున్నారు చాలామంది. సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు తెలిపినప్పటికీ ఎలాంటి మార్పు లేదు. 

 

 

 రోజురోజుకు సెల్ఫోన్ వాడకం ఎక్కువ అవుతుంది తప్ప... ఎక్కడ తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. అయితే సెల్ ఫోన్ వాడకం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి  ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు..అయినప్పటికీ  నేటి తరం జనాల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ వాడుతుంటారు.. రోడ్డు మీద నడుస్తూ సెల్ఫోన్ వాడుతుంటారు... ఏ పని చేస్తున్న సెల్ ఫోన్ వాడుతూ ఉంటారు.. ఇలా రోడ్డు మీద నడుస్తూ రోడ్డు చూడకుండా సెల్ఫోన్ చూస్తుండడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. అంతేకాక డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ వాడటం వల్ల కూడా ఎన్నో అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ ఎవరిలో మార్పు మాత్రం రావడం లేదు. 

 

 

 తాజాగా సెల్ఫోన్ కారణంగా మరో అనర్థం జరిగిపోయింది. సెల్ ఫోన్స్ కారణంగా ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సెల్ ఫోన్ ఇద్దరి ప్రాణాలు తీసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడికొండ రహదారిలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ఆటో లో ముందు కూర్చున్నాడు.తన ఫోన్ ని ఆటో హ్యాండిల్ కు  తగిలించాడు ఆటో లో కూర్చున్న పాసింజర్. అదే సమయంలో ఆ సెల్ ఫోన్ కి కాల్ రావడంతో ఆ సెల్ ఫోన్ ను హ్యాండిల్ నుండి  తీసే ప్రయత్నం చేశాడు. సెల్ఫోన్ తీసే ప్రయత్నంలో ప్యాసింజర్ చేతులు డ్రైవర్ మొహానికి తగిలాయి. దీంతో ఆటో కాస్త అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.  ఈ ఘటనలో   ఇద్దరు మరణించగా .. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: