మూడు రాజధానుల అంశంపై దూకుడుగా వెళ్తున్న ఏపీ సీఎంకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. తాను ఈ విషయంలో ఎవరికి చెప్పాలో వారికి చెబుతా అని కామెంట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఏపీ పర్యటనలో ఉన్న వెంకయ్య నాయుడును రాజధాని అమరావతి రైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

 

ఈ సమయంలో వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు. రాజదాని కి సంబందించి తనను కలిసిన రైతులతో ఆయన మాట్లాడుతూ తాను ఎవరికి చెప్పాలో వారికి చెబుతానని అన్నారు. రాజధాని మారకుండా చూడాలని రైతులు కోరగా, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు రాజధాని కోసం 33వేల ఎకరాలు ఇచ్చారని వెంకయ్య గుర్తు చేశారట. అంతేకాదు.. రాజధాని రైతుల బాధలు, ఇబ్బందులు నాకు తెలుసు. నేను రాజకీయాల్లో లేను, ప్రభుత్వంలో లేను. రాజ్యాంగ పదవిలో ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు.. అన్నారట.

 

స్వర్ణభారతి ట్రస్ట లో ఉన్న ఆయన్ను రైతులు కలిశారు. అప్పుడు ఆయన..  మా ట్రస్ట్ లో ఎలాంటి రాజకీయాలు మాట్లాడకూడదని నియమం. మీ ఆవేదనను అర్థం చేసుకున్నా , ఎవరికి చెప్పాలో వారికి చెబుతా. రాష్ట్రాభివృద్ధి కోసం చేయాల్సింది ఎప్పుడూ చేస్తూనే ఉంటానని అన్నట్లు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే ఆయన ఒక విధంగా జగన్ కు వార్నింగ్ ఇచ్చినట్టే.

 

ఇక వెంకయ్య మంగళవారం  తాడేపల్లిగూడెం ఎన్.ఐ.టి లో స్నాతకోత్సవానికి కూడా  హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడకు వెళ్లినా , తనకు సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటుందని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మాతృభాషను మర్చిపోవద్దని సూచించారు. భాష, భావం రెండు కలిసి నడుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాతృ భాషలోనే మాట్లాడాలని.. ఇంగ్లీషు నెర్చుకోవటంలో తప్పు లేదన్నారు. భాషలు, వేషాలు వేరు కావచ్చు కానీ మనమంతా ఒక్కటే అని వెంకయ్యనాయుడు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: