సుజనాచౌదరి మీద తాను  చేసిన ఆరోపణలకు కట్టుబడి వున్నానని  రాజ్యసభ సభ్యుడు  విజయసాయి రెడ్డి అన్నారు . తాను ఆయనపై చేసిన ఆరోపణలు తప్పయితే ... సీబీఐ విచారణను, ఈడీ విచారణను అడ్డుకోబోనని వైఎస్ చౌదరి ప్రకటించి ఉండేవారని అన్నారు  .   కేంద్రప్రభుత్వం ఈ అంశం మీద దర్యాప్తు చేయాల్సిందిగా హోంమంత్రిత్వ శాఖను ఆదేశిస్తే... అది కేవలం ఎకనాలెడ్జ్ మెంట్ అంటున్న   చౌదరి,   తాను అయన  ప్రతిష్టను దిగజారుస్తున్నానని పేర్కొంటున్నారని విజయసాయి రెడ్డి    ఎద్దేవా చేశారు .

 

అది కేవలం ఎకనాలెడ్జ్ మెంట్ అయితే సుజనాచౌదరి ఎందుకు  భయపడుతున్నారని ప్రశ్నించారు .   డిపాజిటర్లు ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ములను వేల కోట్ల మేరకు మింగేసినా  వ్యక్తిని వదిలేస్తే, దేశంలో న్యాయం, చట్టం అనే పదాలకు విలువ వుండదన్నారు . భారత బ్యాంకింగ్ వ్యవస్థను రూ. 8 వేల కోట్ల మేరకు సుజనా చౌదరి  ఎలా ముంచేశారో, సింగపూర్ లో చేసిన మోసాలు ఏమిటో,  మారిషస్ లో చేసిన కుంభకోణం ఏమిటో... దుబాయ్, అమెరికాల్లో ఆయన ఆర్థికంగా చేసిన తప్పుడు పనులు ఏమిటో... సేల్స్ ట్యాక్స్, కస్టమ్స్, కేంద్ర ఎక్సైజ్, ఐటీ శాఖలను ఎలా నిలువునా ముంచాడో వివరంగా నేను రాష్ట్రపతికి లేఖ రాశానని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు .

 

తాను ఆయనపై చేసిన  ఆ ఆరోపణలు తప్పని సుజనాచౌదరి భావిస్తే... ఎలాంటి విచారణకు అయినా తాను సిద్దం అని ప్రకటించి ఉండేవారన్నారు. కానీ అటువంటి ప్రకటనలు చేయకుండా తన మీద  ఏ సంస్థకానీ, ఏ వ్యక్తికానీ ఎటువంటి   ఫిర్యాదులు చేయలేదంటూ  మరో పచ్చి అబద్దం చెప్పారని వియజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు . సుజనాచౌదరి వంటి ఆర్థిక నేరస్తుల మీద దేశంలోని ఈడీ, సీబీఐ పనిచేయకపోతే అసలు ఆ సంస్థల మనుగడకే అది ముప్పు అని  అన్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: