పేట్‌బషీరాబాద్‌కు చెందిన ఓ యువతి(19) మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంజినీరింగ్ రెండొవ సంవత్సరం చదువుతోంది. అయితే ఈ 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై ల్యాబ్ టెక్నీషియన్ కాలేజీ ల్యాబ్ లోనే అత్యాచారం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో..మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లోని ల్యాబ్ లో ఆమెపై ల్యాబ్ టెక్నీషియన్ కిరాతకరం అత్యాచారం చేశాడన్న విషయం వెలుగులోకి వచ్చింది.



బాధితురాలు సైబరాబాద్‌లోని పెట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్ష కోసం పంపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కళాశాలను తెలంగాణ కార్మిక మంత్రి మల్లా రెడ్డి నిర్వహిస్తున్నారు.



'ఈ రోజు ఉదయం, మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరంలో చదువుతున్న టీనేజ్ అమ్మాయి నుండి మాకు ఫిర్యాదు వచ్చింది. కొద్ది రోజుల క్రితం తాను ప్రయోగశాలలో ఉన్నప్పుడు, ల్యాబ్ టెక్నీషియన్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెపితే ఆమెను చంపేస్తానని బెదిరించినట్లు ఆమె ఫిర్యాదు లో పేర్కొంది.'అని పెట్బషీరాబాద్ పోలీసులు తెలిపారు


పేట్‌బషీరాబాద్‌కు ఇన్స్పెక్టర్ ఎం.మహేష్ ప్రకారం, బి.టెక్ రెండవ సంవత్సరం విద్యార్థినిని వెంకటయ్య సోమవారం అత్యాచారం చేశాడని తెలిపారు. అతను బాధితురాలిని ప్రయోగశాలకు పిలిచి నేరం చేశాడని చెప్పారు. బాధితురాలు మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులను ఆశ్రయించడంతో, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని ఎం.మహేష్ వెల్లడించారు.


సైబరాబాద్‌లో జరిగిన పశువైద్యురాలిని కిడ్నాప్, అత్యాచారం, సజీవదహనం ఘటన మరువక ముందే ఇటువంటి ఎన్నో సంఘటన జరగడం బాధాకరం. దిశ స్కిన్ క్లినిక్ నుంచి తిరిగి వెళ్తుండగా అత్యాచారం చేసి చంపిన నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తరువాత వారు ఎన్‌కౌంటర్‌లో చంపబడ్డారు. ఎన్‌కౌంటర్ యొక్క చట్టబద్ధతపై దర్యాప్తు పెండింగ్‌లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: