దేశంలో పెట్రోల్ ధరలు పెరిగే సమయంలో రూపాయలలో పెరుగుతోంటే తగ్గే సమయంలో మాత్రం పైసల్లో తగ్గుతున్నాయి. సామాన్యులు రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరల వలన ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. మన దేశంలో సాధారణంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేసి ముడిచమురును దిగుమతి చేసుకుంటారు. 
 
అంతర్జాతీయ మర్కెట్లో ముడిచమురు ధర, అమెరికా డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి స్థానాన్ని బట్టి పెట్రోల్ ధరలు మారుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం దేశంలో మిథనాల్ మిళితమైన ఇంధనాన్ని తీసుకొనిరావాలని ప్రయత్నాలు చేస్తోంది. మిథనాల్ మిళితమైన ఇంధనం మార్కెట్లోకి వస్తే లీటర్ పెట్రోల్ పై ఏకంగా 10 రూపాయల వరకు తగ్గుతుంది. మిథనాల్ మిళితమైన ఇంధనం ఉపయోగిస్తే ముడిచమురు దిగుమతి తగ్గటంతో పాటు విధేశీ మారకం ఆదా అవుతుంది. 
 
ప్రస్తుతం దేశంలో ఎక్కువగా లీటర్ 42 రూపాయల ఖరీదు చేసే ఇథనాల్ బ్లెండెడ్ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నారు. మిథనాల్ ధర మాత్రం లీటర్ 20 రూపాయలు మాత్రమే. మిథనాల్ మిళితమైన ఇంధనాన్ని ఉపయోగించటం వలన 2030 సంవత్సరం నాటికి 100 బిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుంది. ప్రపంచంలో ముడిచమురు ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో మూడవ స్థానంలో భారత్ ఉండగా 114.5 మిలియన్ డాలర్ల ముడిచమురు దిగుమతి అవుతోంది 
 
ప్రస్తుతం దేశంలోని ఇండియన్ పెట్రోల్ బంకుల్లో మాత్రమే మిథనాల్ 15 శాతం, పెట్రోల్ 85 శాతం కలిగి ఉన్న మిథనాల్ బెండెడ్ పెట్రోల్ ను విక్రయిస్తున్నారు. దేశంలో అస్సాం పెట్రో కెమికల్స్ లో రోజుకు 100 టన్నుల మిథనాల్ ఉత్పత్తి అవుతుండగా 2020 సంవత్సరం నాటికి మిథనాల్ ఉత్పత్తి రోజుకు 600 టన్నులకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మిథనాల్ మిళితమైన ఇంధనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే లీటర్ పెట్రోల్ పై పది రూపాయలు తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: