ఆంధ్ర ప్రదేశ్ అలాగే కేంద్ర బిజెపి రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాలు కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి ముప్పవరపు వెంకయ్య నాయుడు. గత సంవత్సరం ఆయనను ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టారు. దేశంలో రెండవ పౌరుడిగా గుర్తింపు పొందిన పదవి తెలుగువారికి దక్కడం ఎంతో గౌరవకరమైన విషయం. కానీ ఇటువంటి పదవులు ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని స్వయంగా ఆయన తెలిపారు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేస్తున్నప్పుడు తనకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు దక్కుతాయని వార్తలు వస్తున్నప్పుడు నుంచి తాను అటువంటి పదవులకి సరిపోవని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 మామూలుగా అటువంటి పదవులు దొరికితే ఎవరు కూడా వద్దు అని అనుకోరు. రాష్ట్రపతి , ఉప రాష్ట్రపతి పదవిలో ఉంటే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి. కానీ ఆయనకు ఈ పని ఏ మాత్రం ఇష్టం లేదని తెలుస్తుంది. ఉప రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు వెంకయ్య నాయుడు కూడా దూరం కావాల్సి వచ్చింది. ఏ విషయం అయినా కూడా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వెంకయ్య నాయుడుకి ఇది సరైన పదవి కాదని ఆయన అనుకుంటున్నారు.

 

మంగళవారం తాడేపల్లిగూడెం లో జరిగిన నిట్ తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య నాయుడు రాజధాని అమరావతి విషయం గురించి మాట్లాడారు. అక్కడ ఆయనకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది జగన్ సర్కారు నిర్ణయం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న అమరావతి రాజధాని రైతులు తమకు న్యాయం కల్పించాలని ఆయన కోరారు.

 

కానీ వెంకయ్య నాయుడు వారికి అనుకూలంగా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి లో ఆయన ఉన్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేను నాకు రాజ్యాంగపరమైన బాధ్యత ఒకటి ఉంది. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి ఏదైనా వినతిపత్రం ఇవ్వదలచి ఉంటే దానిని సంబంధిత వ్యక్తులకు అందజేసే బాధ్యత మాత్రం పెట్టుకుంటాను. అంతేకానీ, నా నుంచి ఎటువంటి హామీని ఆశించవద్దు అని రైతులకు మాట చెప్పారట. ఇప్పుడు తెలుస్తుంది ఉపరాష్ట్రపతి పదవి అంటే ఎంత కష్టమో.

మరింత సమాచారం తెలుసుకోండి: