ఆంధ్రప్రదేశ్లో పని చేస్తున్న ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ ని కేవలం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వీలుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఆర్థిక అభివృద్ధి మండలి సీఈఓ పదవి నుంచి ఆయనను తొలగించినట్లు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ పేర్కొంది. గతంలో కృష్ణ కిషోర్ ని ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవో పదవి నుంచి ప్రభుత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శి గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.

 

కేవలం ఆయనను మీద చర్యలు చేపట్టేందుకు వీలుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు వివరించింది. తన డిప్యూటేషన్ ని సవాల్ చేస్తూ కృష్ణ కిషోర్ ప్రభుత్వంపై క్యాట్ కి అప్పీల్ చేసుకున్నాడు. ఈ విషయంపై లోతుగా విచారణ జరిపించాలని ఈ కేసుని జనవరి 31 వరకు వాయిదా వేసింది కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్. కృష్ణ కిషోర్ పై వేసిన సస్పెన్షన్ను పై ఇచ్చిన  మధ్యంతర స్టేను జనవరి నెలాఖరు వరకు పొడిగించింది.

 

ఇప్పటి వరకు బకాయి ఉన్న జీవితాలను రెండు వారాలు లోపల చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్. కృష్ణ కిషోర్ ని సస్పెండ్ చేయాలని చర్యలు తీసుకునే ముందు ప్రభుత్వం ఆ అధికారి మాత శాఖకు సమాచారం ఇవ్వాలి అన్న విషయం గుర్తు చేశారు. కానీ అటువంటివి జరిగినట్టు ఆధారాలేవీ కనిపించట్లేదు అని చెప్పారు.

 

ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి సాధారణ పరిపాలన శాఖకి బదిలీ చేసి అక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా, ఆరు నెలలుగా జీతం కూడా ఇవ్వకుండా సరైన పద్ధతి కాదు అని వారు వ్యాఖ్యానించారు. ఇక్కడ కృష్ణకిషోర్ తరపున సుప్రీం కోర్టు న్యాయవాది రాజ్ మల్హోత్రా జోక్యం చేసుకుంటూ మీకు కేసు పూర్వాపరాలు మొత్తం తెలుసు అని. తాను చెప్పవలసిన పని ఏమీ లేదని కేవలం రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నానని ప్రభుత్వ కాలే అంగీకరిస్తున్నాయి అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: