క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చర్చ్ లన్ని  సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతాయన్న  విషయం తెలిసిందే. ఈ క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ప్రత్యేకంగా భావించి అంగరంగ వైభవంగా చేసుకుంటారు. పాశ్చాత్య దేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రిస్మస్ పండుగ ప్రత్యేకం గా భావించి  అద్భుతం గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక క్రిస్మస్ పండుగ అంటే ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. అంతే కాకుండా శాంతా క్లాస్ వచ్చి కూడా బహుమతులు ఇచ్చి పోతూ ఉంటారు అని నమ్ముతూ ఉంటారు క్రైస్తవులు. ఇక పెద్దలందరూ  తమ పిల్లలకి క్రిస్మస్ సందర్భంగా మంచి మంచి గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు. 

 

 

 

 అయితే ఎవరైనా చిన్న పిల్లలకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఏ  బొమ్మలో చాక్లెట్స్ బిస్కెట్స్ లాంటివి కొనిస్తారు. ఇక అటు పిల్లలు కూడా క్రిస్మస్ సందర్భంగా తమ పెద్దలు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చిన్నారికి తన తల్లి ఓ చిన్ని గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ తెరచి చూసే సరికి అందులో  అరటిపండు ఉంది. యూట్యూబర్  జస్టిస్ మొజిక  తన రెండేళ్ల కూతురు తో ఫ్రాంక్ వీడియో చేద్దామనుకున్నది . క్రిస్మస్ పండుగ సందర్భంగా తన చిన్నారి కూతురు కి చిన్ని గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చింది. తల్లి గిఫ్ట్ ఇవ్వగానే ఎంతో మురిసిపోయి దాన్ని  ఓపెన్ చేసింది ఆ చిన్నారి. 

 

 

 

 ఇక ఆ చిన్నారికి ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసేసరికి దాంట్లో అరటిపండు  ఉంది. ఇక ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసిన ఆ చిన్నారి ఆనందంతో మురిసిపోయింది. బననా  బనానా  అంటూ తల్లి ఇచ్చిన గిఫ్ట్ ను ఎంతో ఆనందంగా స్వీకరించింది ఆ చిన్నారి. అరటిపండు వోలిచి ఇవ్వమని తల్లికి చెప్పగా... అరటి పండు తల్లి ఒలిచి  ఇవ్వడంతో హాయిగా బనానా  తినేసింది ఆ చిన్నారి. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను 20 మిలియన్ల మందికిపైగా ని చూశారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. తల్లి ఇచ్చిన చిన్న గిఫ్ట్ తో అయినా ఆ చిన్నారి కళ్ళలో  ఎంతో ఆనందం కనిపించింది అని కొంతమంది కామెంట్ చేస్తుంటే... ఇంకొంతమంది తల్లి కూతురుకు  చెత్త గిఫ్ట్ ఇచ్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: