బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా  మారిన విషయం తెలిసిందే. రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ మరిన్ని సంచలన నిర్ణయాలకు  తెరలేపింది. జమ్మూకాశ్మీర్లో ఎన్నో దశాబ్దాల నుండి ఎవరు పరిష్కరించలేని  370 ఆర్టికల్ ను రద్దు చేసి పరిష్కరించింది బిజెపి సర్కార్. 370  ఆర్టికల్ రద్దు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 370 ఆర్టికల్ రద్దు అనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తర్వాత జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు పాకిస్థాన్ కూడా 370 ఆర్టికల్ రద్దు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ యుద్ధం చేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో జమ్ము కాశ్మీర్ లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

 

 

 

 జమ్ము కాశ్మీర్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొనే లా కేంద్రం  భారీగా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. జమ్మూకాశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మోహరించిన బలగాలను  ఉపసంహరిస్తు  నిర్ణయం తీసుకుంది. జమ్ము కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత 72 కేంద్ర పారామిలిటరీ బలగాలను వెనక్కి పిలవాలని నిర్ణయించింది . ఇందులో 24 సిఆర్పిఎఫ్ కంపెనీలు, పన్నెడు దళాల బోర్డర్  సెక్యూరిటీ ఫోర్స్, 12కంపెనీల ఇండో-టిబెటన్ పోలీసు దళం, 12 కంపెనీల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, 12 షశస్త్ర  సిమాబెల్  దళాలు ఉన్నాయి. 

 

 

 

 జమ్మూ కాశ్మీర్  లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత శాంతియుత పరిస్థితులు నెలకొనేలా భారీ బలగాలను మోహరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో అంత ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్లో మోహరించిన బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు.ఇకపోతే ఈ  ఏడాది ఆగస్టులో  370 ఆర్టికల్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: