మనుషులు సాంకేతిక విషయంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. మొదటగా సెల్ ఫోన్  ఆ తర్వాత కంప్యూటర్ ఇప్పుడు ఆ స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. సమాచార సాంకేతిక లో ఎన్నో విప్లవాత్మక విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రత్యేక విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే డ్రోన్, బ్లాక్ చైన్ విధానాలను ప్రకటించిన ప్రభుత్వం అదే తరహాలో కృత్రిమ మేధ కూడా గుర్తింపు ఇవ్వనుంది.

 

దీనిపై వచ్చే నెల 2వ తేదీన మంత్రి కేటీఆర్, కేంద్ర ప్రభుత్వ ప్రముఖులు, నిపుణుల సమక్షంలో 2020 కుత్రిమ మేధ సంవత్సరంగా అధికారికంగా ప్రకటించనున్నారు. అదే రోజు దీనికి సంబంధించిన ప్రోత్సాహక విధానాన్ని కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత అమలులో తెలంగాణ ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది అని మన అందరికి తెలుసు.

 

ఇప్పటికే రోబోటిక్స్, డ్రోన్, బ్లాక్ చైన్ ,మిషన్ లెర్నింగ్ లాంటి వివిధ రంగాల్లో పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా కృత్రిమమేధ పైన తన దృష్టిని సారించింది. ఈనెల 18న హైదరాబాద్లో జరిగిన సమావేశంకి దేశం నలుమూలల నుండి నిపుణుల హాజరుఅయ్యారు. ఈ సమావేశాల్లో అభివృద్ధి మార్గదర్శకాలు ప్రోత్సాహకాలు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

 

ఈ సదస్సుకు హాజరు అవుతున్న పారిశ్రామిక వేత్తలు, నిపుణుల సలహాలు సూచనలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి వాటిని కూడా వెల్లడిస్తారని తెలుస్తుంది. ఈ సందర్భంగా పలు అవగాహన ఒప్పందంతో పాటు పలు ప్రాజెక్టులను కూడా ప్రకటిస్తారు అని తెలుస్తోంది. వీటి ద్వారా 2021 నాటికి భారతదేశంలో దాదాపు 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నాస్కామ్ ద్వారా అమలు చేస్తున్నారు అని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: