మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భద్రత విషయంలో తన క్యాటగిరి తగ్గించినప్పుడు కాంగ్రెస్ బీజేపీ మీద విరుచుకు పడింది. అలాగే కొద్ది కాలం కింద సోనియాగాంధీ అలాగే రాహుల్ గాంధీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం సచిన్ టెండూల్కర్ కి క్రికెట్ దిగ్గజం ఎక్స్ క్యాటగిరి సెక్యూరిటీ  ఉపసంహరించింది. అలాగే శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

 

 రాష్ట్రంలోని 45 ప్రముఖుల భద్రత విషయంలో పున సమీక్షించిన ప్రభుత్వం వారి కి ముప్పు తక్కువ ఉందని నిర్ణయిం చేసుకుంది. ఒక ఐపీఎస్ అధికారి సచిన్ టెండూల్కర్ కి ఎక్స్ కేటగిరీలో  సెక్యూరిటీ ఇప్పటి వరకు ఒక పోలీస్ కానిస్టేబుల్ 24 గంటలు కాపలా ఉండేవారు. ఇక నుంచి కేవలం పోలీస్ ఎస్కార్ట్ మాత్రమే ఉంటుంది అని చెప్పారు.

 

బిజెపి నేత ఏక్నాథ్ కి వై క్యాటగిరి సెక్యూరిటీ ఉంటుందని అయన తెలిపారు. అలాగే మాజీ ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ క్యాటగిరి జడ్ ప్లస్ నుంచి ఎక్స్ కేటగిరికి తగ్గించారు. మహారాష్ట్ర లో లాయర్ గా ఉన్న ఉజ్జ్వల నీకంకు జడ్ ప్లస్ కేటగిరి నుంచి వై కేటగిరికి తగ్గించారు. అలాగే ఉద్యమ నేత అయిన అన్నా హజారే భద్రత విషయంలో జెడ్ కేటగిరికి పెంచారు. ఈ సమావేశంలో మొత్తం కమిటీ 97 మందికి సంబంధించిన భద్రతను పున సమీక్షించారు ఇందులో దాదాపు ఇరవై తొమ్మిది మందికి భద్రత పెంచగా 16 మందికి భద్రతను తగ్గించినట్లు తెలుస్తుంది.

 

సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు భద్రత పరిస్థితిని అర్థం చేసుకొని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం, అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన సమాచారంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటామని ఐపీఎస్ అధికారి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: