సంచలన నిర్ణయాలు లకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంతో మంది ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలుపుతున్నారు. అయితే తాజాగా పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

 

 ఇండియా నుంచి వెళ్లిపోవాలి అనుకుంటే ముస్లింలకు 150 దేశాలు ఉన్నాయని కానీ హిందువులకు మాత్రం కేవలం ఉన్నది ఒక ఇండియా మాత్రమే అంటూ గుజరాత్ ముఖ్య మంత్రి విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పై మండిపడ్డారు ఆయన. కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  అభిప్రాయాలను గౌరవించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ... పౌరసత్వ సవరణ చట్టం విషయంలో మాత్రం తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు ఆయన. 

 

 

 

 ప్రపంచం మొత్తంలో ముస్లింలకు 150 దేశాలు ఉన్నాయని... హిందువులకు ఒక భారతదేశం తప్ప మరే దేశమూ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని. బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్లలో ఒకప్పుడు భారీ మొత్తంలో హిందువులు ఉండేవారని..  కానీ ఇప్పుడు వారి సంఖ్య... చాలా తక్కువ అయిపోయింది  అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల హిందువులు వలస వెళ్లాలనుకుంటే మిగిలింది ఒక్క ఇండియా మాత్రమేనని విజయ్ రూపానీ చెప్పుకొచ్చారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం పై దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: