2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పిన్న వయస్కురాలు గా శాసనసభకు ఎన్నికయ్యారు అంబా ప్రసాద్. బర్కాగావో నుంచి ఎన్నికైన ఈమె వారి కుటుంబంలో మూడో వ్యక్తిగా నిలిచారు. ఆమె తండ్రి యోగేంద్ర ప్రసాద్ సావో 2009 లో ఈ సీటు నుండి ఎన్నిక అయ్యి 2013 లో హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అయితే, మావోయిస్టులతో తన సంబంధాలు 2014 లో వెలుగులోకి వచ్చిన తరువాత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

 

తనపై పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా, ప్రసాద్ అసెంబ్లీ రేసు నుండి వైదొలిగారు.  అతని భార్య నిర్మల్ దేవిని బర్కాగావో నుండి పోటీ చేసారు. నిర్మల్ దేవి 2014 లో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు కానీ ఆమె కూడా అనేక క్రిమినల్ కేసులతో సతమతం అయ్యారు. 2016 లో, బార్కాగోలో ప్రభుత్వ విద్యుత్ జనరేటర్ ఎన్‌టిపిసి కోసం భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తుల నిరసనకు ఆమె నాయకత్వం వహించారు, ఇక్కడ ఆమె పోలీసుల కాల్పులను రెచ్చగొట్టి ఐదుగురు మరణించేలా చేసారని ఆమెను జైలుకు పంపారు.

 

యోగేంద్ర సావో కూడా చాలా నెలలు జైలు జీవితం గడిపాడు. జార్ఖండ్‌లో ఉండకూడదనే షరతుతో ఇద్దరికీ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఈ దంపతుల కుమార్తె అంబా ప్రసాద్‌కు టికెట్ ఇచ్చింది. ఎన్నికలో ఆమె తన సమీప ప్రత్యర్థి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజెఎస్‌యు) అభ్యర్థి రోషన్లాల్ చౌదరిని 31,000 ఓట్ల తేడాతో ఓడించింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె కోసం ప్రచారం చేశారు.

 

రఘుబార్ దాస్ ప్రభుత్వం సావో కుటుంబంపై కేసులను పెటిందన్ని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 2016 లో, యోగేంద్ర సావో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఒక ఆడియో, వీడియోను రికార్డ్ చేశారు, ఇందులో రఘుబర్ దాస్ తన శాసనసభ్యుడు భార్య బిజెపి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేలా అతన్ని రప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: