చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే, జయంతి ని వర్ధంతి గా, మంగళగిరి ని మందళగిరి గా అన్నారంటూ అప్పటి ప్రతిపక్షం, ప్రస్తుత పాలకపక్షం ఆరోపించిన సంగతి తెలుసిందే. లోకేష్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా సీఎం వైఎస్ జగన్ పై లోకేష్ చేసిన ఓ ట్వీట్ అయ్యగారిని నవ్వులపాలు చేస్తోంది. 

 

నారా లోకేష్ తాజాగా తన ట్విటర్ అకౌంట్లో "వైకాపా నాయకులు వారి అధ్యక్షుడు వైఎస్ జగన్ గారే పెయిడ్ ఆర్టిస్ట్ అని గుర్తించడం మంచిది. పార్లమెంట్లో మద్దతు ఇస్తారు. అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తారు. బయటమాత్రం మేము వ్యతిరేకం అని ప్రచారంచేస్తారు. 16 ఆగష్టు 2019న NRC పై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.ఇప్పుడు కడప సభలో NRC అమలు చెయ్యమని ముఖ్యమంత్రిగారు చెప్తున్నారు. ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు కదా, ఎంతకైనా దిగజారుతారు." అని సీఎం వైఎస్ జగన్ పై ట్వీట్ చేశారు.

 

నారా లోకేష్ ఎన్ఆర్పి, ఎన్ఆర్సి ఒక్కటే అనుకుని ట్వీట్ చేశారనుకుంటా సార్ రెండింటికి తేడా తెలుసుకోండి అంటూ నెటిజన్లు తెగ ట్వీట్స్ చేస్తున్నారు. అయ్యగారు జగన్ గారిని విమర్శించబోయి మళ్ళీ పప్పులో కాలేశారు అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. గతంలోనూ లోకేష్ ఇలాంటి కామెంట్లు చేసి నవ్వులపాలు అయ్యారు రాష్ట్రంలో ఉల్లి ధరలు పెరగడానికి వైఎస్ జగన్ కారణమంటూ పేర్కొన్న లోకేష్ ను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు జనాభా లెక్కలకు, ఎన్ ఆర్ సి కీ తేడా తెలియకుండా ట్వీట్ చేయడంపై లోకేష్ పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. టీడీపీ నాయకులు మాత్రం లోకేష్ తీరుపై నో కామెంట్స్ అంటూ పక్కకు తప్పుకుంటున్నారు.  

 

https://mobile.twitter.com/naralokesh/status/1209344909267746816

మరింత సమాచారం తెలుసుకోండి: