జగన్మోహన్ రెడ్డి చేసిన  మూడు రాజధానుల ప్రతిపాదన తప్పని నిరూపించేందుకు చంద్రబాబునాయుడుకు ఓ అవకాశం వచ్చింది. అయితే  చంద్రబాబు అంత ధైర్యం చేస్తారా అన్నదే అనుమానం. ఎందుకంటే చంద్రబాబుది ఎప్పుడు కూడా బ్యాక్ డోర్ మెతడే అన్న విషయం అందరికీ తెలుసు. ప్రత్యర్ధిని నేరుగా ఎదుర్కొనేంత సీన్ చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు.  

 

ఇంతకీ విషయం ఏమిటంటే జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదన తప్పని చంద్రబాబు తాజాగా గోల మొదలుపెట్టారు. రాజధానులుగా విశాఖపట్నం, కర్నూలు వద్దని అమరావతే ముద్దంటూ కలుగులో నుండి ఎలుక బయటకు వచ్చినట్లుగా లేటెస్టుగా చినబాబు కూడా  బయటకు వచ్చారు.  సరే  ఈ విషయాలను చూస్తే జగన్ ప్రతిపాదన తప్పని నిరూపించేందుకు తన 22 మంది ఎంఎల్ఏలతో చంద్రబాబు రాజీనామాలు చేయిస్తారా ? అంటూ వైసిపి నేతలు అడుగుతున్నారు.

 

ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఎంఎల్ఏలందరూ రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు  రెడీ అవ్వాలనే పనికిమాలిన ప్రపోజల్ ఒకటి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు లేవనెత్తారు. జగన్ ప్రతిపాదన తప్పని నిరూపించేందుకు వైసిపి ఎంఎల్ఏలకు బదులుగా టిడిపి ఎంఎల్ఏలే రాజీనామాలు చేయవచ్చు కదా అంటూ వైసిపి నుండి కౌంటర్లు మొదలయ్యాయి. టిడిపిలోని 22 మంది ఎంఎల్ఏలు రాజీనామాలు చేసి ఉపఎన్నికల్లో పోటి చేస్తే సరిపోతుందని వైసిపి నేతలంటున్నారు.

 

పదవులకు రాజీనామాలు చేసి ఉపఎన్నికలు ఎదుర్కొనేంత ధైర్యం చంద్రబాబుకు ఉందా అన్నదే ప్రశ్న. 22 మంది ఎంఎల్ఏల్లో ఒక్కరు ఓడిపోయినా జగన్ ప్రతిపాదనే కరెక్టని చంద్రబాబు అంగీకరించాలి. లేకపోతే అన్నీ ఎంఎల్ఏలను మళ్ళీ టిడిపినే గెలుచుకుంటే తన ప్రతిపాదన తప్పని జగన్ ఒప్పుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేయచ్చు.  అంతా బాగానే ఉంది కానీ ఉపఎన్నికలు జరిగితే ఇపుడున్న ప్రధాన ప్రతిపక్షహోదా పోతుందనే చంద్రబాబు భయపడుతున్నట్లు వైసిపి ఎగతాళి చేస్తోంది. చూద్దాం ఏమి జరుగుతుందో.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: