ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నంను చేస్తామంటూ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనను విడుదల చేశారు.  ఈ ప్[రకటనపై రాష్టం లో భిన్న స్పందన వస్తుంది కానీ టీడీపీ మొదటి నుండి వ్యతిరేకిస్తూనే ఉంది కానీ  ఈ ప్రకటనను  స్వాగతించిన టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు గుప్పించారు శ్రీనివాసరావు.

 

విశాఖపట్నంలో గంటా సహా టీడీపీ నేతలు సమావేశమై రాజధాని విషయంపై చర్చించడం జరిగినది.ఈ సందర్బంగా  గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని కావడం సంతోషం కలిగించే విషయం అని అన్నారు. అయితే, అమరావతిలో భూములిచ్చినటు వంటి రైతులకు కూడాన్యాయం చేయాలని స్పష్టం చేయడము జరిగినది.

 


   మెట్రో లైన్ లు,ఫోర్ వే రోడ్లు వేసి నంత మాత్రాన విశాఖపట్నం విశ్వనగరం అంతా సుందరంగా అయిపోదని.. ప్రణాళికాబద్ధమైన మాస్టర్ ప్లాన్ తీసుకోవాలని, ట్రాఫిక్, హౌసింగ్ లాంటి అంశాలపై తగిన జాగ్రత్తలుతీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా తెలియజేస్తున్నామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) ఎన్నికల కోసమే ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే ఆలోచన చేశారనే అనుమానం కూడా ఉందని గంటా శ్రీనివాసరావు తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.

 

 

రాజధాని పేరుతో ప్రశాంత నగరంలో అరాచక శక్తులు ప్రవేశించేందుకు ప్రమాదం పొంచి ఉందని గంటా శ్రీనివాస రావు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.కాగా, మూడు రాజధానుల ప్రభుత్వ ప్రకటనపై ఇప్పటికే అమరావతిలో తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి . ప్రకటన చేసిన నాటి నుంచి నేటి వరకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

 

 

రైతులకు రాజకీయ నాయకులు, న్యాయవాదులు కూడా మద్దతు తెలుపుతున్నారు. హైకోర్టును తరలించవద్దంటూ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని ఇక్కడ్నుంచి తరలించి తమకు అన్యాయం చేయొద్దంటూ రైతులు కోరుతున్నారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే తాము తమ భూములను ఇచ్చామని, ఇప్పుడు భూములను తిరిగి ఇచ్చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. . ఇక కర్నూలులో హైకోర్టు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని అని ప్రభుత్వం ప్రకటించడంతో ఆ ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: