అక్కడ ఉద్యమం చేస్తున్న వారంతా టీడీపీ కార్యకర్తలే మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రతిపక్షం టీడీపీ ధర్మాన తీరుపై మండిపడుతోంది. అమరావతి రైతుల ఆందోళనలపై నోరు జారారు. అక్కడ ఉద్యమం చేస్తున్న వారంతా టీడీపీ కార్యకర్తలే అన్నారు. అమరాతి రైతుల నిరసనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన  ఎమ్మెల్యే ధర్మాన తీరుపై  ప్రతిపక్షం టీడీపీ మండిపడుతోంది. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధాని ఉంటుందని.. అద్భుతమైన నగరం నిర్మిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

జగన్ సర్కార్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. యరపతినేనితో పాటూ మరో 15 మందిపై నమోదైన అక్రమ మైనింగ్‌ కేసుల విచారణను ఇక సీబీఐ చేతికి వెళ్లనుంది. యరపతినేనిపై ఉన్న 18 కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ.. హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ నగర ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించే ఉద్దేశంతో నడుస్తున్న మెట్రో లగ్జరీ ఏసీ బస్సు్ల్లో ఛార్జీలను తగ్గించనున్నారు. అయితే, ఇటీవలే ఆర్టీసీ ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో, మెట్రో లగ్జరీ ధరలను తగ్గిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఆయన కళ్లు చెమర్చగా.. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. వెంటనే మంత్రి వ్యక్తిగత సిబ్బంది నీళ్లు అందించారు. ఆ నీళ్లు తాగి మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి కోరిక విని కళ్లు చెమర్చగా.. సభా వేదికపైనా ఏం మాట్లాడాలో తెలియక ఎమోషన్ అయ్యారు. తన సొంత గ్రామంలో జరిగిన ఓ సభలో మంత్రి తన తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.  

తండ్రి రాజమోహన్ రెడ్డి కోరికపై స్పందించిన మంత్రి గౌతమ్ రెడ్డి.. తప్పకుండా నేరవేరుస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో కాస్త భావోద్వేగానికి గురయ్యారు.  ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి చెరువును నింపుతామని హామీ ఇచ్చారు. ఈ సభలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన సొంత గ్రామంలో చెరువు నిర్మాణం పూర్తి చేసి.. నీళ్లతో నింపాలని తన మనసులో కోరికను బయటపెట్టారు. సోమశిల హై లెవల్ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని కోరారు. మూడేళ్లలో పూర్తి చేసి.. చెరువును నింపాలని.. జిల్లా నుంచి వలసలు ఆగిపోతాయన్నారు. అధికారులు కూడా సహకరించాలని కోరారు.

అన్నీ ఒకే చోట ఉండాలి.. రాజధానిపై వెంకయ్య: ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆత్కూర్ స్వర్ణభాతర్ ట్రస్ట్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన.. ఆసక్తికర విషయాలు చెప్పారు. రాజధాని రైతులు తనను కలిశారని.. వారి ఆవేదనను తెలియజేశారన్నారు. వారి భావోద్వేగం చూసి తనకు ఎంతో బాధ కలిగింది అన్నారు. 

 
 అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని రాజధాని ప్రాంత రైతులు, అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ..నవ్యాంధ్ర రాజధాని రైతుల సమస్యలు నాకు తెలుసని, ఈ అంశంలో ఏంచేస్తే బాగుంటుందో, మంచి జరుగుతుందో అదే చేస్తానని అన్నారు. 

జగన్ సర్కార్‌ను ఇరుకున పెట్టబోయి.. తానే తప్పులో కాలేశారు. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మళ్లీ నెటిజన్లకు దొరికిపోయారు. ఇంకేముంది నెటిజన్లు ఊరుకుంటారా.. ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు. మంత్రిగా ఎలా పనిచేశావయ్యా బాబూ అంటూ లోకేష్‌పై సెటైర్లు పేలుస్తున్నారు. 
 
నౌహీరా షేక్ కేసులో కీలక పరిణామం: స్కీముల పేరుతో అక్రమంగా డిపాజిట్లు సేకరించి రూ.వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిన హీరా గోల్డ్ అధినేత నౌహీరా షేక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నౌహీరా షేక్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
 వైసీపీ ఎంపీ విజయసాయిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. సుజనా ఆర్థిక నేరాలపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేయించాలంటూ విజయసాయి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంపై ఆయన స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. దేశంలో ఏ పౌరుడైనా రాష్ట్రపతికి అర్జీ పెట్టుకుంటే సంబంధిత శాఖలకు పంపిస్తారని.. విజయసాయి ఫిర్యాదు కూడా అలాంటిదేనన్నారు. 

అతడి పేరు రాజు. అసలు పేరు ఎవరికీ తెలియదు. చందానగర్‌లో ధనిక వర్గాల వారు నివాసం ఉండే మై హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటాడు. అద్దె రూపంలోనూ అతడు నెలకు రూ.30 వేలు చెల్లిస్తున్నాడు. ఇక ఇద్దరు పిల్లలు ఇంటర్నేషన్ స్కూల్లో చదువుతున్నారు. వారికి సంవత్సరానికి 8 లక్షల రూపాయలు ఫీజు. భార్య ఒంటిపై బంగారం కిలో వరకు ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: