పాపం.. నారా లోకేశ్.. ప్రస్తుతం ఆయన పరిస్థితి చూసే జాలేస్తోంది. చేయక చేయక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే జనం తిప్పికొట్టారు. పార్టీ ఓడిన బాధ కంటే తాను ఓడిన బాధ ఎక్కువైన దుస్థితి లోకేశ్ ది. ఆ తర్వాత కూడా ఆయన పరిస్థితి అంత బాగా ఏం లేదు. ఏం మాట్లాడినా తేడా కొడుతోంది. అందుకే పాపం.. ఆయన ఎక్కువగా ట్వీట్లను నమ్ముకుంటున్నారు.

 

అయితే ఆ ట్వీట్ల విషయంలోనూ ఇప్పుడు ఆయన తప్పులో కాలేస్తున్నాడు. పాపం.. ఆయన ట్వీట్లు మెయింటైన్ చేసేదెవరో కానీ.. తాజాగా లోకేశ్ పెట్టిన ఓ ట్వీట్ ను ఇప్పుడు నెటిజన్లు ఆడుకుంటున్నారు. అసలు ఇంతకీ ఏమైందంటే.. ఇటీవల సీఎం జగన్.. జిల్లా పర్యటనలో తాము ఎన్ఆర్సీకి వ్యతిరేకమని చెప్పిన సంగతి తెలిసిందే. సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. అయితే జగన్ సర్కార్‌ను ఇరుకున పెట్టబోయి..లోకేశ్ తానే తప్పులో కాలేశారు.

 

ఎందుకంటే.. ఆ ట్వీట్ కు ఆగస్టులో ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన ఓ కాపీని సాక్ష్యంగా జత చేశాడు లోకేశ్. అసలు ట్విస్ట్ ఏంటంటే.. లోకేష్ ట్వీట్ చేసిన గెజిట్ నోటిఫికేషన్.. ఎన్‌ఆర్సీది కాదు.. 2021 జనాభా లెక్కల కోసం జారీ చేసిన నోటిఫికేషన్. అంటే ఎన్‌పీఆర్‌ కు సంబంధించినదన్నమాట. లోకేష్ పొరపాటున 2021 జనాభా లెక్కల కోసం విడుదల చేసిన ఎన్‌పీఆర్ నోటిఫికేషన్‌ను ట్వీట్ చేసి తప్పులో కాలేశారు.

 

ఇక ఈ విషయం గమనించిన నెటిజన్లు లోకేశ్ పై విరుచుకుపడుతున్నారు. NRC, NPRకి మధ్య తేడా తెలియదా అంటూ వెటకారం ఆడుతున్నారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈమాత్రం అవగాహన లేదా అని కడిగేస్తున్నారు. లోకేష్ ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ చేస్తున్నవారికి అమాత్రం తెలియదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలా మరోసారి లోకేశ్ పై ట్రోలింగ్స్ మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: