జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనపై లీగల్ గా ఫైట్ చేయాలని తెలుగుదేశంపార్టీ డిసైడ్ అయ్యింది.  పార్టీ రాజ్యసభ ఎంపి కనకమేడల రవీంద్ర  ఈ విషయాన్ని మీడియాతోనే స్పష్టంగా చెప్పారు. కనకమేడల స్వయంగా లాయర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.  కాబట్టి జగన్ ప్రతిపాదనను ఎలా ఎదుర్కోవాలా అన్న విషయాన్ని చంద్రబాబునాయుడు ఆదేశాలతోనే రవీంద్ర కోర్టును ఆశ్రయించబోతున్నారు.

 

అసెంబ్లీలో జగన్  మూడు రాజధానుల ప్రకటన చేసిన దగ్గర నుండి ఎలా అడ్డుకోవాలా ? అన్న  విషయం మీద టెన్షన్ పడిపోతోంది.  ఎందుకంటే జగన్ ప్రతిపాదనపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బాగా సానుకూలత కనిపిస్తోంది. అదే సమయంలో  కోస్తా జిల్లాలైన తూర్పు, పశ్చిమ గోదారుల్లో కూడా స్పందన అనుకూలంగానే ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా సానుకూల స్పందన కనిపిస్తోంది.

 

ఇక మిగిలింది రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణా జిల్లాలు మాత్రమే. అయితే ఈ జిల్లాల్లో కూడా జగన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో మాత్రమే ఆందోళనలు జరుగుతున్నాయి. దాంతో చంద్రబాబు, ఎల్లోమీడియాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. దాంతో ఆందోళనలను మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు తెరవెనుక పెద్ద ప్లానే జరుగుతోంది. ఇందులో భాగంగానే  జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రం అట్టుడికిపోతుందని, మంటలు మండుతున్నాయనే తప్పుడు రాతలు రాస్తున్నారు.

 

అయితే ఇటువంటి ఆందోళనలతో  జగన్ ను అడ్డుకోలేమని చంద్రబాబు గ్రహించారు. అందుకనే ప్రధానమంత్రిని కూడా సీన్ లోకి లాగుతున్నారు. అదే సమయంలో ఎందుకైనా మంచిదని లీగల్ గా కూడా ప్రొసీడ్ అవుతున్నారు.  జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా హై కోర్టులో కేసులు వేయాలని డిసైడ్ అయ్యారు. ఒక్క టిడిపి మాత్రమే వేస్తే ఇబ్బంది అవుతుందని అనుకున్నారు. అందుకనే రాజధాని ప్రాంతంలోని రైతుల పేర్లతో టిడిపినే కేసులు వేయటానికి రెడీ అయిపోయింది. మొత్తం మీద జగన్ ను ముందుకు పోనీకుండా వీలైనన్ని ప్రయత్నాలు చేస్తోంది టిడిపి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: