వాట్సాప్... నేటి తరానికి పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం వాట్సాప్ వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది. టెక్నాలజీ రోజురోజుకు పెరిగినట్లుగానే  వాట్సాప్ వాడే వినియోగదారుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఆన్లైన్ లో ఎన్ని యాప్ లు  ఉన్నప్పటికీ వాట్సాప్ కి ఉండే క్రేజే వేరు. వాట్సాప్ కంటే ఎక్కువ ఫీచర్లు ఉన్న యాప్స్  ఆన్లైన్లో అందుబాటులో ఉన్నప్పటికీ... అందరూ వాట్సాప్ వైపే మొగ్గు చూపుతుంటారు. ఇక  వాట్సప్ కూడా సరికొత్త ఫీచర్లను  ప్రవేశపెడుతూ వినియోగదారులు అందరినీ ఆకర్షిస్తూ వుంటుంది. ఇప్పటికే ఎన్నో సరికొత్త ఫీచర్లను  ప్రవేశపెట్టి.. ఎంతోమంది వినియోగదారులను ఆకర్షించింది  వాట్సప్. అయితే వాట్సాప్ వాడేవారికి ఒక చిన్న చేదు వార్త. 

 

 వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ కొన్ని ఫోన్లలో పనిచేయదు. ఇంతకీ ఆ ఫోన్ లు ఏవి  ఎందుకు పని చేయదు తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ యూజర్ల అందరూ వాట్సాప్ ని వాడుతున్న విషయం తెలిసిందే. చిన్న ఫోన్ అయిన  పెద్ద ఫోన్ అయిన  వాట్సాప్ ఇన్స్టాల్ చేసి వాడేస్తూ ఉంటారు నేటితరం జనాలు. అయితే వాట్సాప్ వాడేవారికి వాట్సాప్ యాజమాన్యం ఓ చేదు వార్త తెలిపింది . వచ్చే ఏడాది నుంచి పాత ఫోన్ లో వాట్సాప్ పని చేయదు అని తెలిపింది.  ఇప్పటికే కొన్ని ఫోన్ లలో వాట్సప్ పనిచేయడం మానేసింది. పాత ఫోను ఉన్నవారు వాట్సాప్ ఉపయోగించాలంటే కొత్త ఫోన్లు కొనాల్సిందే. 

 


 ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఫోన్లలో పాత వర్షన్ ఫోన్లు అన్నిటిలో వాట్సాప్ పని పనిచేయదు. 2020 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. వెంటనే మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం ఏదో  చెక్ చేసుకుంటే మంచిది . 2. 3.7 ఆపరేటింగ్ సిస్టం ఉన్న ఫోన్ లు  ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ పని చేయదు అంతేకాకుండా... ఐవోఎస్  8 కన్నా తక్కువ ఉన్న ఫోన్లలో కూడా వాట్సాప్ పని చేయదు. 2019 డిసెంబర్ 31 నుంచి అన్ని తక్కువ ఐఓఎస్ ఉన్న ఫోన్ లో వాట్సాప్ పని చేయడం ఆగిపోతుంది. ఇలాంటి స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందని వాట్సాప్ నిర్ధారించింది. అందువల్ల పాత ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఉన్న ఫోన్ లో వాట్సాప్ నిలిపివేస్తే ఎక్కువ మంది పై ప్రభావం పడదని వాట్సాప్ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: