ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సొంత ట్రస్ట్ స్వర్ణ భారతి ట్రస్ట్ కి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి విషయంపై జరుగుతున్న చర్చలపై మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా జగన్ తీసుకున్న వికేంద్రీకరణ వంటి అంశం గురించి తాను ముందుండి చెబుతున్నట్లు దానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టత ఇచ్చారు. అంతే కాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత  అన్ని కేంద్ర సంస్థలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి కృషి చేసానని, ఆనాడు జిల్లాకో కేంద్ర సంస్థను ఏర్పాటు చేపించానని వెల్లడించారు.

 

విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ అటువంటి పునరావృతం తప్పు జరగకుండా ఉండాలంటే వికేంద్రీకరణ జరపాల్సిందే అని ముఖ్యమంత్రి జగన్ తీసుకొన్ననిర్ణయం కరెక్ట్ అని వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ...ఇదంతా రాజకీయ అనుభవంతో చెబుతున్నావా వివాదం కోసమో లేకపోతే రాజకీయ కోసమో కాకుండా మనస్ఫూర్తిగా చెబుతున్నాడని ఇదే విషయాన్ని కేంద్రంలో ఉన్న పెద్దలు మూడు రాజధానులు గురించి నన్ను ప్రశ్నలు అడిగినా ఇదే విషయాన్నీ చెబుతానని వెల్లడించారు.

 

అంతేకాకుండా మాతృభాషకు ప్రాధాన్యం విషయంలో కూడా తనది మొదటి నుంచి ఒకటే అభిప్రాయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగులో ప్రాధమిక బోధన ఉండాలనేదే తన అభిప్రాయంమన్నారు. ప్రధాని సైతం మాతృ భాషకు ప్రాధాన్యం పై అనేక సార్లు చెప్పారన్నారు. దీంతో వెంకయ్యనాయుడు చేసిన కామెంట్లు విని జగన్ పార్టీ నేతలు షాక్ లో ఉన్నట్లు సమాచారం. మరోపక్క చాలా మంది జాతీయ పార్టీ నేతలు ఇంకా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం చాలా మంచిదని రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మిగిలి ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోకుండా ఉంటుందని మూడు రాజధానుల కాన్సెప్ట్ సమర్ధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: