వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కువగా అమరావతిలోనే ఉంటున్నారు.  తాడేపల్లి వద్ద నిర్మించుకున్న సీఎం క్యాంప్ ఆఫీస్ లోనే ఉంటూ పరిపాలన చేస్తున్నాడు.  ఇప్పుడు జగన్ ఓ ఒక్క ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు కాబట్టి జగన్ రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ అన్ని ప్రాంతాలలో అభివృద్ధికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.  గత మూడు రోజులుగా జగన్ కడపలో పర్యటిస్తున్నారు.  కడపలో పర్యటిస్తున్న జగన్ ఆ జిల్లాకు అనేక పధకాలు రూపొందించారు.

 
నిన్నటి రోజున రాయచోటిలో పర్యటించిన జగన్ ఈరోజు పులివెందులలో పర్యటిస్తున్నారు.  పులివెందుల జగన్ సొంత నియోజక వర్గం.  గత ఎన్నికల్లో జగన్ అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పులివెందుల నియోజక వర్గంలో జగన్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటె, పులివెందుల అభివృద్ధి కోసం జగన్ 26 రకాల అభివృద్ధి కార్యమ్రాలకు శంకుస్థాపన చేశారు. 


దీనికోసం ప్రభుత్వం రూ. 1327 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా అనేకం త్వరలోనే చేపట్టబోతున్నట్టు జగన్ తెలిపారు.  కాగా, ఇదే రోజున జగన్ వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కూడా ప్రారంభోత్సవం చేశారు.  దీనికోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా,ఈరోజు జగన్ పులివెందుల చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కూడా పాల్గొన్నారు.  ఈ వేడుకల్లో పాల్గొన్న అనంతరం జగన్ అక్కడి నుంచి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  


జగన్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే.  రాష్ట్రంలో జగన్ అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అక్కడ రగడ సృష్టిస్తోంది.  అమరావతిని కాదని విశాఖలో రాజధానిని  ఏర్పాటు చేస్తే దాని వలన వచ్చే ఫలితం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  దీనిపైనే ఇప్పుడు రగడ జరుగుతున్నది. కొంతమంది జగన్ కు జై కొడుతుంటే.. జై కొడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: