ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్ యాప్స్ లో  ఎక్కువగా  వినియోగదారులున్న యాప్  గూగుల్ పే . ఆన్లైన్ లో ఎన్నో ఆన్లైన్ పేమెంట్ యాప్ లు  ఉన్నప్పటికీ చాలా మంది ప్రజలు మాత్రం గూగుల్ పే పైనే  మొగ్గు చూపుతుంటారు. గూగుల్ పే ద్వారా ఎన్నో మనీ ట్రాన్స్ఫర్ లు బిల్లులు చెల్లింపులు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువ అయిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆన్లైన్ పేమెంట్ యాఫ్ ల ద్వారా ప్రజలను బురిడీ కొట్టించే సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోయారు. ఈ నేపథ్యంలో గూగుల్ పై తన కస్టమర్ల కోసం పలు సూచనలు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం రండి. గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే గూగుల్ పే యాప్ ని మాత్రమే డౌన్లోడ్ చేసుకొని వినియోగదారులు వాడాలి. అంతేకాకుండా యాప్ లో చూపించిన కస్టమర్ కేర్ నెంబర్ లకు  మాత్రమే సంప్రదించాలి. గూగుల్ పే యాప్ లో మనీ రిక్వెస్ట్ రాగానే స్పందించి మనీ సెండ్  చేయకూడదు.

 

 

 

 మనీ రిక్వెస్ట్ పంపిన వారిని అడిగి ఆ తర్వాత ప్రాసెస్ చేయాలి అంతేగాని అపరిచితుల నుంచి మనీ రిక్వెస్ట్ పెడితే దాని యాక్సెప్ట్  చేయకూడదు. గూగుల్ పే కస్టమర్ ప్రతినిధి అంటూ ఎవరైనా ఇతరులు కాల్ చేసి  బ్యాంక్ సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే.. అలాంటి వారికి ఎలాంటి వివరాలు చెప్పకూడదు. వినియోగదారులను ఎవరూ బ్యాంక్ డీటెయిల్స్ అడగరు . కొంతమంది డేట్ అఫ్ బర్త్ మొబైల్ నెంబర్ పేరు వివరాలు వెరిఫై చేసుకోవాలంటే కాల్ చేస్తారు  అలాంటి వారికి ఎలాంటి సమాచారం అందించ కూడదు. 

 

 

 హెనీ డెస్క్  లేదా టీం వ్యూవర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటూ కొందరు కాల్ చేసి చెస్తారు. నిజానికి ఇలాంటి యాప్ లు  ఎవరు ఫోన్లో వాడకూడదు. ఇలాంటి కాల్ కి స్పందించ కూడదు. కొంతమంది కాల్ చేసి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు చెప్పాలని లేకపోతే బ్లాక్ అవుతుందని వినియోగదారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలాంటి వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలని గూగుల్ పే తన వినియోగదారులకు సూచించింది. అయితే ఈ మధ్య గూగుల్ పే కస్టమర్ కేర్ పేరుతో కూడా కొంత మంది వినియోగ దారులను  సైబర్ నేరగాళ్లు మోసం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ కస్టమర్లకు కొన్ని జాగ్రత్తలు తెలిపింది గూగుల్ పే.

మరింత సమాచారం తెలుసుకోండి: