జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌ పి ఆర్), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ ఆర్‌ సి) పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ- ఇత్తెహాదుల్-ఉల్-ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ  అసదుద్దీన్ ఒవైసి బుధవారం ఆరోపించారు.

 

 

 

 

 

 

 

 

 

 

నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌ పి ఆర్) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌  ఆర్‌ సి) మధ్య తేడా లేదు. కేంద్ర హోం మంత్రి  అమిత్ షా   దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిరసన తెలుపుతాయి అని  అసదుద్దీన్  ఒవైసి తెలంగాణ ముఖ్యమంత్రి  కె చంద్రశేఖర్ రావుతో సమావేశం తరువాత విలేకరులతో అన్నారు.   పౌరసత్వ సవరణ చట్టం (సి ఎ ఎ) రాజ్యాంగానికి విరుద్ధమని సమావేశం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంగీకరించారని, అందుకే పార్లమెంటులో తన పార్టీ టి ఆర్ ఎస్ దీనిని వ్యతిరేకించిందని కె సి ఆర్ చెప్పారని,  ఎఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్  ఎంపి అసదుద్దీన్ ఒవైసి  చెప్పారు.

 

 

 

 

 

 

 

 

 

సి ఎ ఎ, ఎన్‌ పి ఆర్‌ లను వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీల సమావేశాన్ని త్వరలో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎన్‌ పి ఆర్‌ కు, ఎన్‌ ఆర్‌ సి కి మధ్య తేడా లేదని మేము ముఖ్యమంత్రి కి  వివరించాము. మేము ఆయనకి  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి పత్రాలను చూపించాము, ఈ పత్రాలు   ఎన్‌ పి ఆర్‌, ఎన్‌ ఆర్‌ సి  వైపు మొదటి అడుగు అని నిరూపిస్తున్నాయి. అందువల్ల, దీని పై స్టే ఇవ్వమని మేము ముఖ్యమంత్రి ని   డిమాండ్ చేసాము, అని అసదుద్దీన్  ఒవైసీ చెప్పారు.  హోం మంత్రి  అమిత్ షా తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు, ఈ అంశం పై  ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తూ ఎన్‌ పి ఆర్‌ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు  అసదుద్దీన్  ఒవైసీ  తెలిపారు.  కేరళ, ఇతర రాష్ట్ర  ప్రభుత్వ ల  మాదిరిగా  ఎన్‌ పి ఆర్‌ ను తెలంగాణ ప్రభుత్వం  వ్యతిరేకించాలని  కెసిఆర్‌ ను కోరినట్లు ఒవైసీ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: