చంద్రబాబునాయుడు యూటర్నులు, చారిత్రక తప్పిదాలు కంటిన్యు అవుతునే ఉన్నాయి.  ఐదేళ్ళ అధికారంలో ఉన్నపుడు మొదలైన యూటర్నులు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యు అవుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులపై చంద్రబాబు యూటర్న్ తీసుకుని మరో తప్పు చేస్తున్నట్లు అనుమానంగా ఉంది.

 

అసెంబ్లీలో జగన్ చేసిన ప్రతిపాదనను ఓ రెండు రోజులు చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత జనాల మూడ్ చూసిన తర్వాత యూటర్న్ తీసుకున్నారు. మెజారిటి ప్రజల ఎలా నిర్ణయిస్తే తాను అందుకు తగ్గట్లే ఫాలో అవటానికి సిద్దంగా ఉన్నానంటూ అనంతపురం జిల్లా పర్యటనలో మీడియాతో చెప్పారు. అంటే జగన్ ప్రతిపాదనకు చంద్రబాబు కూడా నిర్ణయించినట్లే అని పార్టీ నేతలందరూ  అనుకున్నారు.

 

కానీ అనంతపురంలో టూర్ ముగించుకుని అమరావతికి తిరిగి వచ్చిన తర్వాత ఎల్లోమీడియా యాజమాన్యంతో మాట్లాడారని సమాచారం. దాని తర్వాత హఠాత్తుగా సోమవారం యూటర్న్ తీసుకున్నారు. జగన్ ప్రకటనపై దాదాపు వారం రోజులుగా ఆందోళనలు చెబుతున్నా జనాలకు చంద్రబాబు కనీసం మద్దతు కూడా చెప్పలేదు. అలాంటిది సోమవారం తుళ్ళూరుకు వెళ్ళి అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళకు మద్దతుగా స్పీచులివ్వటం ఆశ్చర్యంగా ఉంది.

 

అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న జనాలకు మద్దతుగా మాట్లాడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలతో ఇబ్బంది వస్తుందని ముందు భయపడ్డారు. కానీ తర్వాత ఏమయ్యిందో ఏమో  బహిరంగంగా విశాఖపట్నం, కర్నూలును వ్యతిరేకిస్తు జగన్ ను సవాలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

 

ఒకవైపేమో పార్టీలో నేతలు చంద్రబాబు స్టాండ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  అమరావతికి మద్దతుగా జిల్లా కమిటిల్లో తీర్మానాలు చేయమన్న చంద్రబాబు ఆదేశాలను జిల్లాల్లో నేతలు లెక్క కూడా  చేయటం లేదు. మరి ఇలాంటి పరిస్ధితుల్లో  జగన్ కు ఇచ్చిన మద్దతును మళ్ళీ చంద్రబాబు వ్యతిరేకిస్తు తీసుకున్న యూటర్న్ చారిత్రక తప్పిదమే అవుతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: