కోరిక పుట్టిన శరీరానికి వయస్సుతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తుందని తెలిసిందే. అందుకే కొందరు మగ మృగాలు కూతురు వయస్సు, మనవరాలి వయస్సు ఉన్న వారితో కూడా తమ శృంగార వాంచలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు మనం చూడబోయేది.. ఒక యువతిని రేప్ చేసి, ఆ రేప్ కు సంబంధించిన చిత్రాలను బహిరంగం చేస్తానని ఒక ముసలాయన ఆమెను కొన్ని వారాలుగా బెదిరిస్తున్నాడు. ఒకరోజు అతని వేధింపులు హద్దులు మించాయి. దాంతో ఆ బాధలు తాళలేక ఆ కామపిచాచి కళ్ళలో గమ్ పోసి, ఆపై అతని గొంతు కోసి హతమార్చింది ఆ యువతి. వివరాల్లోకి వెళితే,

 

 

తమిళనాడులోని తుత్తుకూడికి చెందిన అమ్మన్ శేఖర్(54) చెన్నై కి వచ్చి కర్పూరం హోల్ సేల్ వ్యాపారం చేస్తూ బాగా డబ్బులు సంపాదించేవాడు. శేఖర్ కూతురు, ఇంకా ఆమె స్నేహితురాలైన పవిత్ర అనే 24ఏళ్ల యువతి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. అయితే, శేఖర్ కూతురితో కంబైన్డ్ స్టడీస్ చేయడానికి తన స్నేహితురాలు ఆమె ఇంటికి తరచూ వచ్చి వెళ్తుండేది. అలా ఆమె తన ఇంటికి వస్తుంటే.. శేఖర్ ఆమెపై కామవాంఛ పెంచుకున్నాడు. తరువాత తనికి ఖరీదైన బహుమతులను, విచ్చలవిడిగా డబ్బులిస్తూ ఆమెను క్రమక్రమంగా తన వలలో వేసుకొని ఆమెతో అక్రమ సంబంధం పెట్తుకున్నాడు..

 

 

ఈ విషయం బాధితురాలి కుటుంబానికి తెలిసినా.. శేఖర్ వారికి ఆర్థిక సాయం చేస్తుండటంతో.. వారు ఏం జరగలేదనట్లు మౌనంగా అతని వికృత చేష్టలను భరించేవారు. అయితే, ఒక నెల క్రితం తన తల్లిదండ్రులు ఆమెకు పెళ్ళి సంబంధం చూసి, ఆమెకు మ్యారేజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న శేఖర్ ఆమె తన పెళ్లిని విరమించుకోవాలని బలవంతం చేయడం ప్రారంభించాడు. ఒకానొకరోజు తన న్యూడ్ చిత్రాలను తన బంధువులకు పంపిస్తానని శేఖర్ బెదిరించాడు. దాంతో అతని హింసతో విసిగిపోయిన ఆ యువతి శేఖర్ ని చంపాలని నిర్ణయించుకుంది. ప్లాన్ లో భాగంగా, ఆమె అతనికి బహుమతి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి అతన్ని వాషర్‌మెన్‌పేట్‌లోని  ఓ ప్లే గ్రౌండ్‌కు రమ్మని పిలిచింది.

 

 

అలా వీళ్లిద్దరు ఇలియట్ బీచ్ వద్ద కొంత సమయం గడిపారు. ఆపై వాషర్‌మెన్‌పేట్‌ తిరిగి వచ్చారు. ఆ సందర్భంలోనే ఆమె బహుమతి ఇస్తానని, కళ్ళు మూసుకోమని శేఖర్ తో చెప్పింది. ఏం ఇస్తుందో అని సిగ్గుపడుతూ అతడు కళ్ళు మూసుకున్నాడు. అప్పుడే, ఆమె గట్టిగ గాలి పీల్చుకొని, ఆ తర్వాత శేఖర్ కళ్ళలో జిగురు గమ్ పోసి అతన్ని కసితీరా పొడిచి, గొంతు కోసి పారిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు అక్కడే కుప్పకూలి, తుదిశ్వాస విడిచాడు. సోమవారం రాత్రి శేఖర్ మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందింది. ప్రాధమిక దర్యాప్తులో, అతను చివరిసారిగా ఆ మహిళతో కనిపించాడని పోలీసులు కనుగొన్నారు. సో, ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత ఆమె మొత్తం ఎపిసోడ్‌ను వివరించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: