తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనపర్తి మండలం పేరా రామచంద్రాపురంలోని ఓ ఆయిల్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని ఆయిల్‌ మొత్తం అగ్నికి ఆహుతైంది. వివరాల్లోకి వెళితే..  ఉదయం ఫ్యాక్టరీలో దట్టమైన పొగలు  వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకుగురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచారు. కాకినాడ, మండపేట, రాజమండ్రి సహా జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

 

ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కంపెనీలో చెలరేగుతున్న మంటలను అదుపు చేసారు. కంపెనీలో సిబ్బంది ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇతర దేశాల నుంచి ఆయిల్‌ దిగుమతి చేసుకుని ఈ కేంద్రంలో శుద్ధి చేస్తూ ఉంటారు. కాగా కొంత కాలంగా తరచూ ఇబ్బంది పెడుతున్న ఈ ప్లాంట్‌లో ఆధునీకీకరణ పనులు పూర్తి చేశారు. గత నాలుగు రోజులుగా ఈ ఫ్యాక్టరీలో తిరిగి ఆయిల్‌ శుద్ధి పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీలో భారీగా నూనె నిల్వలున్నట్లు సమాచారం. ఇంతలో ఈ ప్రమాదం జరిగి ఆయిల్‌మిల్లులో ఆయిల్ నిల్వలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.


ఈ మిల్లులో దాదాపుగా 100కుపైగా కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉదయం సమంయలో  ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో కార్మిరులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తనష్టం మాత్రం కోట్లలో జరిగిందని అంచన.  ఎగసిపడుతున్న మంటలకు ఆయిల్ తోడు కావడంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది. 


అయితే  ఇప్పుడు జరిగిన ఈ అగ్ని ప్రమాదం షాట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా  కొత్త యంత్రాల రాపిడి వల్ల జరిగిందా.. అన్న విషయం ఇంకా నిర్థారణ కాలేదు.  సుమారు ఆరు ఫైరింజన్లతో ఈ మంటలను అదుపు చేసారు.  ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: