గ్రహణం అంటే మనదేశంలో చాలా జాగ్రత్తలు తీసుకునే అలవాటు ఉంది. ప్రపంచంలో శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందకముందే పలు విశ్వరహస్యాలను మనవారు ఛేదించారు. వాటిలో ఖగోళ విషయాలు అనేకం ఉన్నాయి. ఏ సమయంలో ఏ గ్రహం ఎలా ఉంటుంది, గ్రహణాలు ఎప్పుడు, తిథులు, వాతావరణ విశేషాలు ఇలా అనేకం ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. ఈ ఏడాదిలో చివరి గ్రహణం డిసెంబరు 26న ఏర్పడుతోంది. ఈసారి ఏర్పడే కంకణాకార కేతుగ్రస్త గ్రహణం తిరిగి 16 ఏళ్ల తర్వాత సంభవించనుంది. మరో వైపు ఆ వైకుంఠవాసుని ఆలయాలు కూడా మూతపడతాయి.

 

ఈ గ్రహణ సమయంలో చాలా మంది నిష్టగా ఉంటారు. ముఖ్యంగా గర్భిణులు ఇంటి నుంచి బయటకు రాకూడదు. అలాగే బాలింతలు గ్రహణానికి ఆరు గంటల ముందే భోజనం తినేయాలి. కొందరు గ్రహణానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడం అలవాటుగా ఉంటుంది. మరికొందరు ఇంటిని దాటి గ్రహణం సమయంలో బయటకు రాలేరు.

 

కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల శ్రీవారి ఆలయం మరి కొన్ని గంటల్లో మూత పడబోతోంది. బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయ తలుపులను మూసివేశారు. గురువారం సూర్య గ్రహణాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రహణ కాలం ఆరంభానికి ఆరు గంటల ముందే ఆలయాన్ని మూసివేయడం సంప్రదాయంగా వస్తోంది. తిరుమల సహా రాష్ట్రంలోని అన్ని ఆలయాలను కూడా మూసివేయనున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయం ఇందుకు మినహాయింపు.

 

సూర్యగ్రహణం కారణంగా 13 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఇదివరకే వెల్లడించింది. బుధవారం రాత్రి 11 గంటల నుంచి 13 గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తామని తెలిపింది. గ్రహణం ముగిసిన అనంతరం సంప్రదాయబద్ధంగా సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించిన ఆలయం తలుపులను తెరుస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: