ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుపుత్రుడు, మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ రాజధాని ప్రాంతంలో రేపు పర్యటించనున్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రాంత రైతులు అమరావతిని తరలించొద్దంటూ ఆందోళనకు దిగిన విషయం విధితమే. 

                              

దీంతో రాజధాని ప్రాంత రైతులకు నారా లోకేశ్ సంఘీభావం ప్రకటించారు. ఇందులో భాగంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఎర్రబాలెం, 11 గంటలకు మందడం, 12 గంటలకు వెలగపూడి రైతులు, కూలీలతో భేటీ అవుతారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారితో కలిసి నారా లోకేశ్ నిరసన వ్యక్తం చేయనున్నారు. 

                               

కాగా నారా లోకేష్ ఈ విషయంపై ఇప్పటికే ట్విట్టర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో ఇప్పటికే రాజధాని రైతులకు మద్దతుగా ట్విట్ చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కులం అంటగడతారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం 90 శాతం మంది సన్న కారు రైతులు భూములిచ్చారని, వాళ్లు ఇన్‌సైడర్ ట్రేడింగ్ పాల్పడతారా? అంటూ లోకేశ్ ట్విట్టర్ లో ఎగిరిపడ్డారు. 

 

అయితే సాధారణంగానే నారాలోకేష్ ఎక్కువ ట్విట్లు చేస్తుంటారు. ఇప్పుడు మరింత ఎక్కువ చేశారు. మొన్నటికి మొన్న నారా లోకేష్ మళ్ళి పప్పులోకి కాలు వేశారు. దీంతో రేపు రాజధాని రైతులను కలిసి లోకేష్ ఎం మాట్లాడుతాడో.. రేపు మీడియాలో రచ్చ రచ్చే అంటూ సంచలన ట్విట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి రేపు ఎం అవనుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: